
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ మలిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మహిళా క్రికెటర్ల కోసం ఐపీఎల్‌లో ప్రయోగాత్మకంగా బీసీసీఐ మే 22న ప్రత్యేకంగా ఏకైక టి20 మ్యాచ్‌ని నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు కెప్టెన్లుగా స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనున్నారు.
తాజాగా గురువారం ఈ మ్యాచ్‌కి సంబంధించిన వివరాలను ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా మాట్లాడుతూ 'ఈ స్పెషల్ గేమ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత్‌తో పాటు ప్రపంచం మొత్తం టెలికాస్ట్ చేస్తాం' అని అన్నారు. ఈ మ్యాచ్‌లో పాల్గొనే జట్లను ఐపీఎల్ ట్రయిల్ బ్లేజర్స్, ఐపీఎల్ సూపర్ నోవాస్ జట్లుగా విభజించారు.
మొత్తం 26 మంది క్రీడాకారిణిలు ఈ మ్యాచ్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌కు చెందిన 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. గాయం నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా సారథి మెక్‌లానింగ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టులో ఈమెకు స్థానం దక్కింది.
ఐపీఎల్ ట్రయిల్ బ్లేజర్స్ జట్టుకు స్మృతి మందాన కెప్టెన్‌గా వ్యవహారించనుంది. స్మృతి మందాన జట్టులో అలెస్సా హీలే, సూయిజ్ బేట్స్, దీప్తి శర్మ, బీత్ మూనీ, జెమియా రోడ్రిగూస్, డేనిఎల్లి హాజెల్, శిఖా పాండే, లీ తాహుహు, జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్, డి హెమలతలు చోటు దక్కించుకున్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఐపీఎల్ సూపర్ నోవాస్ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహారించనుంది. హర్మన్ ప్రీత్ కౌర్ జట్టులో డేనియెల్లి వ్యాట్, మిథాలీ రాజ్, మెగ్ లానింగ్, సోఫియా డివైన్, ఎలిసన్ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మూన మెహ్రమ్, పూజ వస్త్రాకర్, మెగన్ సచుట్, రాజేశ్వర్ గైక్వాడ్, అర్జున పాటిల్, తనియా భాటియాలకు చోటు దక్కింది.
ముంబైలోని వాంఖడె స్టేడియంలో మే 22న ఐపీఎల్ క్వాలిఫయిర్ 1కు ముందు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్‌ని నిర్వహిస్తున్నారు. ఈ ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్లతో పాటు విదేశీ మహిళా క్రికెటర్లు సైతం పాల్గొనున్నారు.
గతేడాది భారత జట్టు వన్డే వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత... మహిళల క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందు గాను ఐపీఎల్ తరహాలో మహిళా క్రికెటర్లకు ఓ లీగ్ నిర్వహించాలని పలువురు బీసీసీఐని కోరిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్:
స్మృతి మంధాన (కెప్టెన్), అలీసా హీలీ (వికెట్ కీపర్), సుజీ బెట్స్, దీప్తి శర్మ, బెత్ మూనీ, జెమీమా రోడ్రిగ్స్, డానియల్ హజెల్, శిఖా పాండే, లీ టహుహు, జులన్ గోస్వామి, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, హేమలత.
ఐపీఎల్ సూపర్ నోవాస్:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), డానియెల్లి వ్యాట్, మిథాలీ రాజ్, మెగ్ లానింగ్, సోఫీ డివైన్, ఎలైస్ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, పూజా వస్త్రాకర్, మెగన్ షుట్, రాజేశ్వరి గైక్వాడ్, అనూజ పాటిల్, తానియా భాటియా (వికెట్ కీపర్).