Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఐసీసీ మేటి వన్డే ప్లేయర్‌గా రికార్డ్!

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. గతేడాది వన్డేల్లో స్మృతి మంధాన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో ఐసీసీ.. ఆమెను మేటి వన్డే ప్లేయర్‌గా ఎంపిక చేసింది. గతేడాది వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు, శతకాలు చేసిన మహిళా బ్యాటర్‌గా స్మృతి మంధాన నిలిచిన విషయం తెలిసిందే.

మంధాన 13 ఇన్నింగ్స్‌ల్లో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. 95 ఫోర్లతో పాటు 6 సిక్స్‌లు కొట్టింది. ఈ అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మంధాన తర్వాత లౌరా వోల్వార్డ్(697), టామీ బ్యూమోంట్(554), హీలీ మాథ్యూస్(469) ఉన్నారు.

Smriti Mandhana crowned ICC Women s ODI Cricketer of the Year for 2024

స్మృతి మంధాన అసాధారణ ప్రదర్శనతో ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు అర్హత సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో మంధాన 24 ఇన్నింగ్స్‌ల్లో 1358 పరుగులు చేసింది.

మంధాన సూపర్ బ్యాటింగ్‌తో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలుచుకుంది. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించింది. డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులతో రాణించింది. ఈ ప్రదర్శనతోనే ఐసీసీ.. మంధానను మేటి వన్డే ప్లేయర్‌గా ఎంపిక చేసింది.

ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్‌గా ఎంపికవ్వడం స్మృతి మంధానకు ఇది రెండో సారి. 2018లోనూ ఆమెకు ఈ అవార్డ్ వరించింది. అంతేకాకుండా 2018, 2021లో స్మృతి మంధాన ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా నిలిచింది. ఈ సారి కూడా ఐసీసీ వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ రేసులో మంధాన ఉంది. కానీ ఆమెకు న్యూజిలాండ్ ప్లేయర్ అమెలియా కేర్‌తో పోటీ నెలకొంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024‌ను న్యూజిలాండ్ గెలవడంలో అమెలియా కేర్ కీలక పాత్ర పోషించింది.

Story first published: Monday, January 27, 2025, 14:47 [IST]
Other articles published on Jan 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+