Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. మగాళ్లకు సాధ్యం కానీ రికార్డ్!

టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 600 ఫోర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచింది. పురుష క్రికెట్‌లో కూడా ఇప్పటి వరకు ఈ రికార్డ్ నమోదు కాలేదు. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 74) హాఫ్ సెంచరీ నమోదు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించింది.

కోహ్లీ, రోహిత్‌కు సాధ్యం కానీ రికార్డ్..

ఈ జాబితాలో స్మృతి మంధాన(604) అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్(521), చమరి ఆటపట్టు(493), బాబర్ ఆజామ్(477), బెత్ మూనీ(459), పాల్ స్టిర్లింగ్(449) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి రోహిత్ శర్మ మాత్రమే స్మృతి మంధాన తర్వాత అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. రోహిత్ 383 ఫోర్లు కొట్టాడు.

Smriti Mandhana Creates History Becomes the First Cricketer Globally Men s or Women s to Hit 600 Fours in T20Is

మహిళల అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కూడా స్మృతి మంధాన నిలిచింది. ఈ జాబితాలో సుజీ బేట్స్ మాత్రమే 4720 పరుగులతో స్మృతి మంధాన కంటే ముందుంది. స్మృతి 4475 పరుగులతో రెండో స్థానంలో నిలిచింది. ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత సుజీ బేట్స్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే భవిష్యత్తులో ఈ రికార్డ్ స్మృతి సొంతమవనుంది. పురుష, మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతను 4596 పరుగులు చేశాడు.

అభిమానులు, మీడియాకు స్మృతి మంధాన కీలక విజ్ఞప్తి

అభిమానులు, మీడియాకు స్మృతి మంధాన కీలక విజ్ఞప్తి

భారత్ ఘన విజయం..

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 74), షెఫాలీ వర్మ(38 బంతుల్లో 10 ఫోర్లతో 55) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రిచా ఘోష్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లెంగే(2/32) రెండు వికెట్లు తీయగా.. ఇరిస్ జ్విల్లింగ్, హీథర్ సీగర్స్, మిర్తే వాన్ డెన్ రాడ్ తలో వికెట్ తీసారు.

అనంతరం నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. బాబెట్ డీ లీడే(27 బంతుల్లో 3 ఫోర్లతో 28), హీథర్ సీగర్స్(16 బంతుల్లో 4 ఫోర్లతో 21) మినహా అంతా విఫలమయ్యారు. తెలుగు తేజం శ్రీచరణి(4/19) నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. షెఫాలీ వర్మ(3/20) మూడు వికెట్లు పడగొట్టింది. నందని శర్మకు రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మకు ఒక వికెట్ దక్కింది.

మ్యాచ్ మధ్యలో పీరియడ్స్.. స్మృతి మంధాన ఏమన్నారంటే?

మ్యాచ్ మధ్యలో పీరియడ్స్.. స్మృతి మంధాన ఏమన్నారంటే?
Story first published: Thursday, June 18, 2026, 12:47 [IST]
Other articles published on Jun 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+