Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Rankings: దుమ్మురేపిన స్మృతి మంధాన!

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన దుమ్మురేపింది. కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్‌తో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ 2025లో స్మృతి మంధాన అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన గత లీగ్ మ్యాచ్‌లో మంధాన సెంచరీతో చెలరేగిన విషయం విదితమే.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన మంధాన 365 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది. ఇదే టోర్నీలో ఆస్ట్రేలియాపై 80, ఇంగ్లండ్‌పై 88 పరుగులు చేసింది. దాంతో స్మృతి మంధాన ఖాతాలో 828 రేటింగ్ పాయింట్స్‌ చేరాయి. స్మృతి మంధాన కెరీర్‌లో ఇదే అత్యుత్తమ రేటింగ్ పాయింట్స్. మంధాన తర్వాత ఆష్లీన్ గార్డ్‌నర్(731) రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఆమె ఆరు స్థానాలు ఎగబాకింది. మంధానకు ఆమెకు 97 పాయింట్ల వ్యత్యాసం ఉంది. లారా వోల్వార్ట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని రెండో స్థానంలో నిలిచింది.

Smriti Mandhana Climbs to Career-Best ICC Ranking After Stellar World Cup Performances

భారత్ నుంచి మరే బ్యాటర్ టాప్-10లో లేకపోవడం గమనార్హం. హర్మన్ క్రౌత్ కౌర్ మూడు స్థానాలు దిగజారి 18వ స్థానంలో నిలవగా.. జెమీమా రోడ్రిగ్స్ 8 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరింది. న్యూజిలాండ్‌పై సెంచరీతో చెలరేగిన ప్రతికా రావల్ 12 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంక్ అందుకుంది. బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా బౌలర్ అలాన కింగ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆ దేశానికే చెందిన ఆష్లీ గార్డ్‌నర్ రెండో స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్ మరిజన్నే కాప్ నాలుగు, దీప్తి శర్మ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

గురువారం జరగనున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ప్రతీకా రావల్ గాయంతో జట్టుకు దూరమైంది. ఆమె స్థానంలో షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. సమష్టిగా రాణిస్తేనే ఆస్ట్రేలియాపై టీమిండియాకు విజయం దక్కనుంది.

Story first published: Tuesday, October 28, 2025, 18:27 [IST]
Other articles published on Oct 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+