Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL vs WI: పాపం ధనంజయ డిసిల్వా.. క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరగని రీతిలో ఔట్! (వీడియో)

SL vs WI: Dhananjaya De Silva Gets Dismissed In Funny Way As Hit Wicket Video Goes Viral

గాలే: శ్రీలంక ఆల్‌రౌండర్ ధనంజయ డిసిల్వాను దురదృష్టం వెంటాడింది. దాంతో క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరగని విచిత్రకర రీతిలో అతను ఔటయ్యాడు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం డిసిల్వా ఔట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జోరు కనబర్చిన డిసిల్వా(95 బంతుల్లో 5 ఫోర్లతో 61).. వెస్టిండీస్ పేసర్ షెనన్ గాబ్రియల్ బౌలింగ్‌లో హిట్ వికెట్ అయ్యాడు.

అతను వేసిన 95వ ఓవర్ రెండో బంతిని డిసిల్వా డిఫెన్స్ చేయగా.. అది కాస్త ఎడ్జ్‌ తీసుకుని స్టంప్స్‌ను తాకబోయింది. ఈ క్రమంలో బంతిని స్టంప్‌కు తగలకుండా ఆపడానికి డిసిల్వా ప్రయత్నించాడు. ఆ క్రమంలో చూసుకోకుండా తన బ్యాట్‌తో బెయిల్స్‌ను కొట్టి హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక టెస్టుల్లో హిట్‌ వికెట్‌గా వెనుదిరగడం అతనికి ఇది రెండోసారి. అధేవిధంగా టెస్ట్‌ క్రికెట్‌లో రెండు సార్లు హిట్‌ వికెట్‌గా ఔటైన రెండో శ్రీలంక ఆటగాడిగా కూడా ధనంజయ డి సిల్వా చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు.. ధనంజయ డిసిల్వా దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నట్లున్నాడుగానని కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 133.5 ఓవర్లలో 386 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(300 బంతుల్లో 15 ఫోర్లతో 147) సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ పాతుమ్ నిస్సంక (140 బంతుల్లో 7 ఫోర్లతో 56), డిసిల్వా హాఫ్ సెంచరీలతో రాణించారు. దినేశ్ చండీమల్(83 బంతుల్లో 5 ఫోర్లతో 45) విలువైన పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టెన్ చేజ్ 5 వికెట్లతో చెలరేగగా.. జోమెల్ వారికన్ మూడూ, షెనన్ గాబ్రియల్ రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 42 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 రన్స్ చేసింది. క్రీజులో కైల్ మేయర్స్(22 బ్యాటింగ్), జాసన్ హోల్డర్(1 బ్యాటింగ్) ఉన్నారు. కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్(41) మినహా టాపార్డర్ మొత్తం విఫలమైంది. లంక బౌలర్లలలో రమేశ్ మెండీస్ మూడు వికెట్లు తీయగా.. ప్రవీణ్ జయ విక్రమా రెండు, లసిత్ ఎంబుల్దెనియా ఓ వికెట్ తీసాడు.

Story first published: Monday, November 22, 2021, 17:49 [IST]
Other articles published on Nov 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+