SL vs PAK: సెంచరీ ఏమైందిరా.. ఆజాము! ఓహో.. స్కాట్లాండ్, జింబాబ్వే కాదు కదా!
గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమయ్యాడు. 16 బంతుల్లో 13 పరుగులే చేసి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో అతనిపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంచరీలు చేసేందుకు శ్రీలంక జట్టు.. జింబాబ్వే, స్కాట్ లాండ్‌లా బలహీనం కాదు కదా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
'సెంచరీ ఏమైందిరా ఆజాము! ఓహో.. స్కాట్లాండ్, జింబాబ్వే కాదు కదా!'అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. భారీ అంచనాలతో బరిలోకి దిగి బాబర్ ఆజామ్ తీవ్రంగా నిరాశపరిచాడని మండిపడుతున్నారు. 'కొందరైతే నీ బొమ్మ తిరగబడే రోజు వచ్చిందిరా ఆజామూ'అని సెటైర్లు పేల్చుతున్నారు. బోడి గుండుతో బరిలోకి దిగి జట్టుకు బొక్క పెట్టాడని జోకులు పేల్చుతున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. క్రీజులో సౌద్ షకీల్(88 బంతుల్లో 6 ఫోర్లతో 69 బ్యాటింగ్), అఘా సల్మాన్(84 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 61 నాటౌట్) ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రభత్ జయసూర్య మూడు వికెట్లు తీయగా.. కసున్ రజితా, రమేశ్ మెండీస్ తలో వికెట్ తీసారు.
అంతకుముందు 242/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు కుప్పకూలింది. ధనంజయ డిసిల్వా(214 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 122) సెంచరీతో రాణించగా.. ఏంజేలో మాథ్యూస్(109 బంతుల్లో 9 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించారు.
పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, అబ్రర్ అహ్మద్ మూడేసి వికెట్లు తీయగా.. అఘా సల్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన పాకిస్థాన్.. ప్రభత్ జయసూర్య(3/83) ధాటికి101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అబ్దుల్లా షఫీక్(19), ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్, సర్ఫరాజ్ అహ్మద్(17) దారుణంగా విఫలమయ్యారు.
షాన్ మసూద్(39) కాసేపు పోరాడినా అతనికి రమేశ్ మెండిస్ చెక్ పెట్టాడు. ఈ పరిస్థితుల్లో సౌద్ షకీల్, అఘా సల్మాన్ హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 120 పరుగుల అజేయ భాగస్వామ్యంతో గట్టెక్కించారు. అయితే వర్షం కారణంగా రెండో రోజు ఆట నిర్ణీత సమయం కన్నా ముందే ముగిసింది. పాకిస్థాన్ ఇంకా 91 పరుగుల వెనుకంజలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications