Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడు బంతులకు 3 వికెట్లు(వీడియో)

టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో టీ20లో ఫెర్గూసన్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా 6వ ఓవర్‌ వేసిన ఫెర్గూసన్.. ఆఖరి బంతికి కుశాల్ పెరెరా(3) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

అనంతరం తన మరుసటి ఓవర్‌ అయిన 8వ ఓవర్‌లో తొలి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు సాధించి హ్యాట్రిక్ సాధించాడు. కామిందు మెండిస్(1), చరిత్ అసలంక(0)లను ఔట్ చేసి ఈ హ్యాట్రిక్ ఫీట్ అందుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున హ్యాట్రిక్ వికెట్ సాధించిన ఐదో న్యూజిలాండ్‌ బౌలర్‌గా రికార్డ్‌ సాధించాడు.

SL vs NZ Lockie Ferguson to pick T20I hat-trick in 2nd T20I against Sri Lanka

కుశాల్ మెండీస్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన ఫెర్గూసన్.. చరిత్ అసంకను క్యాచ్ ఔట్ చేశాడు. ప్రస్తుతం ఈ హ్యాట్రిక్ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హ్యాట్రిక్ సాధించిన లాకీ ఫెర్గూసన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 108 పరుగులకు కుప్పకూలింది. విల్ యంగ్(30), జోష్ క్లర్క్సన్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(4/17) నాలుగు వికెట్లు తీయగా... మతీష పతీరణ(3/11) మూడు వికెట్లు పడగొట్టాడు. నువాన్ తుషారకు రెండు, మహీష్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు శ్రీలంక 19.5 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది. పాతుమ్ నిస్సంక(51 బంతుల్లో6 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో(3/7), గ్లేన్ ఫిలిప్స్(3/6) మూడేసి వికెట్లు తీయగా.. బ్రెస్ వెల్, గ్లేన్ ఫిలిప్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Sunday, November 10, 2024, 23:00 [IST]
Other articles published on Nov 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+