Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sri Lanka vs India: ధావన్ జట్టుకు స్వాగత వేడుకలు లేవు.. చరిత్రలో తొలిసారి ఇదే!!

SL vs IND: No garland ceremony for Shikhar Dhawans Team in Sri Lanka due to COVID-19
Ind vs SL 2021 : Under coach Rahul Dravid, Shikhar Dhawan-led Team India leaves for Sri Lanka

కొలంబో: సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్ సారథ్యంలో భారత పరిమిత ఓవర్ల జట్టు సోమవారం శ్రీలంకలో అడుగుపెట్టింది. జూలై 13 నుంచి ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడేందుకు కొలంబో చేరుకుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉండగా.. లంకలో ఈ పరిమిత ఓవర్ల టీమ్‌ను ధావన్ ముందుకు నడిపించనున్నాడు. భారత దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా ఈ యువ జట్టుకు దిశానిర్దేశం చేయనున్నాడు.

స్వాగత వేడుకలు లేవు

స్వాగత వేడుకలు లేవు

ముంబైలోని ఓ హోటల్‌లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న భారత జట్టు.. అక్కడి నుంచి నేరుగా స్పెషల్ ప్లైట్‌లో కొలంబోకి చేరుకుంది. 20 మందితో కూడిన భారత్ జట్టు కొలంబోకి చేరుకోగా.. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జట్టుకి ఎలాంటి స్వాగతాల్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ఏర్పాటు చేయలేదు. సాధారణంగా లంక టూర్‌లో టీమ్‌కి హోటల్‌లో సంప్రదాయ ప్రకారం స్వాగతాలు ఏర్పాటు చేసేవారు. కానీ కరోనా కారణంగా అవేమీ భారత జట్టుకు దక్కలేదు. ప్లైట్‌ దిగగానే ధావన్ సేన నేరుగా హోటల్‌కు చేరుకుంది. హోటల్ సిబ్బంది కూడా ఆటగాళ్లను పలకరించలేదు. భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారేమో.

కనీసం ఆటగాళ్లను కూడా చూడలేదు

కనీసం ఆటగాళ్లను కూడా చూడలేదు

టీమిండియా బస చేస్తున్న హోటల్ జనరల్ మేనేజర్ పంకజ్ సంపత్ డెక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ... 'స్వాగత వేడుకలను పక్కన పెట్టండి. కనీసం మేము భారత ఆటగాళ్లను కూడా చూడలేదు. హోటల్ సిబ్బంది కూడా ఆటగాళ్లను పలకరించలేదు. ప్లేయర్స్ వెనకాల నుంచి తమ గదుల్లోకి వెళ్లిపోయారు.

శ్రీలంక, భారత జట్లు రెండూ కఠినమైన బయో- సెక్యూర్ బబుల్‌లో ఉండనున్నాయి. టీమ్స్‌కి హోటల్‌లో సేవలందించే స్టాఫ్‌ని ప్రత్యేకంగా నియమించాం. వాళ్లు కూడా హోటల్‌లోనే సిరీస్ ముగిసే వరకూ ఉండనున్నారు. ప్లేయర్లకి భోజనం కూడా కొన్ని సపరేట్ ప్లేస్‌లలో మాత్రమే అందించనున్నాం' అని అన్నారు.

Tokyo Olympics 2021: అప్పుడు రజతం.. ఇప్పుడు లక్ష్యం గోల్డ్! ఫేవరేట్‌గా సింధు!

2018 తర్వాత

2018 తర్వాత

జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది. కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలు, టీ20లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో అన్ని మ్యాచులు జరుగుతాయి.

 శ్రీలంక టూర్‌కు వెళ్లిన టీమ్

శ్రీలంక టూర్‌కు వెళ్లిన టీమ్

శిఖ‌ర్ ధావ‌న్‌, పృథ్వీ షా, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌, రుతురాజ్ గైక్వాడ్‌, సూర్య‌కుమార్ యాద‌వ్, మ‌నీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీష్ రాణా, ఇషాన్ కిష‌న్‌, సంజు శాంస‌న్‌, యజువేంద్ర చహ‌ల్‌, రాహుల్ చ‌హర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాద‌వ్, వ‌రున్ చ‌క్ర‌వ‌ర్తి, భువ‌నేశ్వ‌ర్‌ కుమార్‌, దీప‌క్ చ‌హ‌ర్‌, న‌వ్‌దీప్ సైనీ, చేత‌న్ స‌కారియా.

Story first published: Wednesday, June 30, 2021, 13:15 [IST]
Other articles published on Jun 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+