Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL vs BAN: 5 పరుగులు 7 వికెట్లు.. బంగ్లాపై శ్రీలంక ఘన విజయం!

సొంతగడ్డపై శ్రీలంక క్రికెట్ టీమ్ దుమ్మురేపుతోంది. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న శ్రీలంక.. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. కొలంబో వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన శ్రీలంక 77 పరుగుల తేడాతో సంచలన విజయాన్నందుకుంది. మరోవైపు బంగ్లాదేశ్ 5 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక(123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 106) సెంచరీతో రాణించగా.. కుశాల్ మెండీస్(43 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) పర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్(4/47) నాలుగు వికెట్లు తీయగా.. తంజీమ్ హసన్ సకీబ్(3/45) మూడు వికెట్లు పడగొట్టాడు. తన్వీర్ ఇస్లామ్, నజ్ముల్ హొస్సేన్ షాంటో తలో వికెట్ తీసారు.

SL vs BAN Sri Lanka Sets World Record as Bangladesh Suffers Dramatic 7-Wicket Collapse for 5 Runs

అనంతరం బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 167 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. తంజీద్ హసన్(61 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62), జాకీర్ అలీ(64 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగా(4/10) నాలుగు వికెట్లు తీయగా.. కామిందు మెండీస్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. అసితా ఫెర్నాండో, మహీష్ తీక్షణ చెరో వికెట్ తీసారు.

5 పరుగులు.. 7 వికెట్లు

లక్ష్యచేధనలో బంగ్లాదేశ్ 100/1 పటిష్టంగా కనిపించింది. కానీ 5 పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోయింది. నజ్ముల్ హోస్సేన్ షాంటో(23) రనౌటవ్వగా.. హసరంగా వేసిన మరుసటి ఓవర్‌లో లిటన్ దాస్(0) ఎల్బీగా డకౌటయ్యాడు. టౌహిడ్ హృదయ్(1‌)ను కామిందు మెండీస్ ఔట్ చేయగా.. మెహ్‌దీ హసన్ మిరాజ్(0)‌ను హసరంగా పెవిలియన్ చేర్చాడు. తంజీమ్ హసన్ సకీబ్(1), టస్కిన్ అహ్మద్(0)‌లను ఒకే ఓవర్‌లో కామిందు మెండీస్ ఔట్ చేశాడు. దాంతో 5 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది.

39 ఏళ్ల రికార్డ్ బద్దలు..

దాంతో శ్రీలంక వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. అతి తక్కువ పరుగుల వ్యవధిలో ఎక్కువ వికెట్లు తీసిన జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంకనే టాప్‌లో ఉండగా.. తాజా రికార్డ్‌తో 39 ఏళ్ల ఫీట్‌ను అధిగమించి రెండో ప్లేస్‌ను సొంతం చేసుకుంది. 2008లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రీలంక 3 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు పడగొట్టింది. 1986లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు పడగొట్టింది. ఈ రికార్డ్‌ను శ్రీలంక తాజా మ్యాచ్‌తో అధిగమించింది. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు తీసింది.

Story first published: Wednesday, July 2, 2025, 22:56 [IST]
Other articles published on Jul 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+