SL vs BAN:మూడు మార్పులతో వస్తున్నాం.. లంకకు ముచ్చమటలే: బంగ్లా కెప్టెన్ షకీబ్

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-4కు అర్హత సాధించనుండగా.. ఓడిన జట్టు ఇంటిదారి పట్టనుంది. దాంతో ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందే కయ్యానికి కాలు దువ్వారు. నువ్వెంతా? అంటే నువ్వెంతా? అనే రేంజులో సవాల్ చేసుకున్నారు.

చేజింగ్‌కు అనుకూలమనే..
ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ డసన్ షనక బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ వికెట్‌పై చేజింగ్ అనుకూలమని, పైగా ఈ పిచ్‌ను తరుచూ ఉపయోగించిందని చెప్పాడు. ఈ మ్యాచ్ కోసం మంచి ప్రిపరేషన్స్‌తో వచ్చామని చెప్పిన డసన్.. బ్యాటింగ్‌లో మెరుగ్గా రాణించాల్సి ఉందన్నాడు. గత రెండేళ్లు జట్టు ఎంతో మెరుగవుతూ వచ్చిందని, స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

మూడు మార్పులతో..
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సైతం టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్లమని, కానీ అది మన చేతుల్లో లేదని చెప్పాడు. అఫ్గాన్‌తో బ్యాటింగ్‌లో విఫలమయ్యామని చెప్పిన షకీబ్.. ఈ రోజు భిన్నంగా ఉంటుందని చెప్పాడు. జట్టు మూడు కీలక మార్పులతో బరిలోకి దిగుతున్నామని, శ్రీలంకకు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నాడు. మీడియాలో మాట్లాడిన విషయాలను పెద్దగా పట్టించుకోమని, గుడ్ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.

బంగ్లాకు అంత సీన్ లేదు..
ఈ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో శ్రీలంక సారథి డసన్ షనక.. బంగ్లాదేశ్ పసికూన అంటూ పేర్కొన్నాడు. ఆ జట్టులో ఇద్దరే ఇద్దరు ప్రపంచ స్థాయి ప్లేయర్లున్నారని, అఫ్గాన్ కంటే చాలా బలహీనమైన జట్టని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ టీమ్ డైరెక్టర్ ఖలీద్ మహమూద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు ఇద్దరైనా ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారని, శ్రీలంకలో వారు కూడా లేరని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

తుది జట్లు
బంగ్లాదేశ్: సబ్బిర్ రెహ్మాన్, మోసద్దెక్ హోస్సెన్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(కీపర్), అఫిఫ్ హోస్సెన్, మహముదుల్లా, మెహ్‌దీ హసన్, టస్కిన్ అహ్మద్, మెహ్‌దీ హసన్ మీర్జా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఎబాడట్ హోస్సెన్
శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్(కీపర్), చరిత్ అసలంక, దనుశ్క గుణతిలక, భానుక రాజపక్స, వానిందు హసరంగా, డసన్ షనక, చమికా కరుణరత్నే, మహీశ్ తీక్షణ, దిల్షన్ మదుషంక, అసితా ఫెర్నాండో
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications