బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఇరు జట్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నిదహాస్ ట్రోఫీలో నాగినీ డ్యాన్స్‌తో మొదలైన వీరి వాగ్వాదం.. వన్డే ప్రపంచకప్‌లో టైమ్డ్ ఔట్ రూల్‌తో మరింత జఠిలమైంది. భారత్ వర్సెస్ పాకిస్థాన్ సమరంలా.. హైటెన్షన్‌తో ఇరు జట్లు తలపడుతున్నాయి.
తమ ఆట కంటే ఎటకారంతోనే అభిమానులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ జట్టు.. మూడు టీ20ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. బంగ్లాదేశ్ పరాజయాన్ని ఎగతాళి చేస్తూ శ్రీలంక ఆటగాళ్లు టైమ్డ్ ఔట్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. అప్పట్లో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదే పర్యటనలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. శ్రీలంక ఆటగాళ్ల ఎగతాళిని తమదైన శైలిలో తిప్పికొట్టారు. టైమ్డ్ ఔట్ సెలెబ్రేషన్స్‌కు కౌంటర్‌గా బ్రోకెన్ హెల్మెట్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. వన్డే సిరీస్ ట్రోఫీ అందుకున్న తర్వాత ఆ జట్టు సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్.. హెల్మెట్ తీసుకొచ్చి బ్రోకెన్ హెల్మెట్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఎటకారం మాములుగా లేదంటూ.. ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
టైమ్డ్ ఔట్ సెలెబ్రేషన్స్ అంటే..?
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో శ్రీలంక వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఓ బ్యాటర్ ఔట్ అయిన తర్వాత నిర్ణీత సమయంలో అతను మరో బంతిని ఎదుర్కోకపోవడంతో అప్పటి బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు.
ఫీల్డ్ అంపైర్ రూల్స్ ప్రకారం మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా ప్రకటించారు. దాంతో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా టైమ్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్‌గా మాథ్యూస్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోయిందని, దాంతోనే ఆలస్యమైందని మాథ్యూస్ వివరణ ఇచ్చుకున్నా లాభం లేకపోయింది. అప్పీల్‌ను వెనక్కి తీసుకోవాలని షకీబ్ అల్ హసన్ రిక్వెస్ట్ చేసినా అతను పట్టించుకోలేదు.
అప్పట్లో ఈ టైమ్డ్ ఔట్‌పై తీవ్ర దుమారం రేగింది. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని శ్రీలంక ఆటగాళ్లు ఆరోపించారు. ఐసీసీకి కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ విజయానంతరం మాథ్యూస్ టైమ్డ్ ఔట్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు.
బ్రోకెన్ హెల్మెట్ సెలెబ్రేషన్స్ ఎందుకు..?
టైమ్డ్ ఔట్ అయిన సమయంలో తన హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోయిందని, అప్పిల్‌ను వెనక్కు తీసుకోవాలని బంగ్లాదేశ్ కెప్టెన్‌ను మాథ్యూస్ బతిమాలాడాడు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ముష్ఫికర్ రహీమ్.. మాథ్యూస్ బ్రోకెన్ హెల్మెట్ పేరిట నాటకం ఆడాడంటూ ఎటకారం చేశాడు.