For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SL vs BAN: 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..!

SL vs BAN, World Cup 2023: క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బ్యాటర్ ఔటైన తర్వాత నిర్ణీత సమయంలో క్రీజులోకి వచ్చి బాల్ ఆడకపోవడంతో అంపైర్లు ఔటిచ్చారు.

146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఓ బ్యాటర్ టైమ్ ఔట్‌గా వెనుదిరగడం ఇదే తొలిసారి. 1877లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ జరగ్గా.. ఇప్పటి వరకు 2000 ప్లస్ టెస్ట్‌లు, 4600 పైగా వన్డేలు, వెయ్యికి పైగా టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పటి వరకు ఇన్ని మ్యాచ్‌లు జరిగినా.. ఏ బ్యాటర్ కూడా టైమ్ ఔట్‌గా వెనుదిరగలేదు.

 SL vs BAN: First time happened Angelo Mathews given TIMED OUT in the 146 years history of cricket

నిబంధనల్లో టైమ్ ఔట్ ఉన్నా.. కొన్ని సార్లు బ్యాటర్లు ఆలస్యమైనా కెప్టెన్లు క్రీడా స్పూర్తిని పాటిస్తూ చూసి చూడనట్లు వదిలేసారు. అప్పీల్ చేసినా.. వెనక్కి తీసుకున్నారు. కానీ తాజా శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్.. మాథ్యూస్ విషయంలో జాలి చూపించలేకపోయాడు. తాము ఏం అన్యాయంగా వ్యవహరించడం లేదని, నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని మాథ్యూస్‌కు తేల్చి చెప్పాడు. దాంతో అతను చాలా కోపంగా మైదానం వీడాడు.

షకీబ్ అల్ హసన్ వేసిన 25వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతికి సదీర సమరవిక్రమా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో
ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. అయితే గార్డ్ తీసుకునే సమయంలో అతని హెల్మెట్ స్ట్రిప్ ఊడిపోవడంతో.. మరో హెల్మెట్ తీసుకురావాలని తమ డగౌట్ వైపు చూపించాడు. బంతి ఎదుర్కోకుండా హెల్మెట్ కోసం వేచి చూసాడు.

దాంతో నిర్ణీత సమయం ముగియడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ అప్పీల్ చేశాడు. అంపైర్ నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను ఔటిచ్చాడు. మాథ్యూస్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. షకీబ్‌ను కన్విన్స్ చేయాలని సూచించారు. షకీబ్ మాత్రం తన అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించాడు. ఇక్కడ మాథ్యూస్ ఓ బంతి ఆడి హెల్మెట్ తెప్పించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

అయితే టైమ్ ఔట్ అనే నిబంధన గురించి అతనికి అవగాహన లేకపోవడంతోనే ఇలా విచిత్రకర పరిస్థితుల్లో వెనుదిరిగాడు. నిర్ణీత సమయంలో క్రీజులోకి వస్తే సరిపోతుందని మాథ్యూస్ భావించి ఉంటాడు. టైమ్ ఔట్ రూల్ ప్రకారం.. కొత్తగా క్రీజులోకి వచ్చే బ్యాటర్ 120 నిమిషాల్లో బంతిని ఎదుర్కోవాలి. లేకుంటే టైమ్ ఔట్‌గా పరిగణిస్తారు.

Story first published: Monday, November 6, 2023, 17:17 [IST]
Other articles published on Nov 6, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+