Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL vs AUS: చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. విజయం ముంగిట ఆసీస్!

ఆస్ట్రేలియా తాత్కలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. జట్టులోని 11 మంది ఆటగాళ్లతో 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి బ్యాటర్‌గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డ్‌ను అధిగమించాడు. రికీ పాంటింగ్ 10 మంది ఆటగాళ్లతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో స్మిత్.. అలెక్స్ క్యారీతో కలిసి నాలుగో వికెట్‌కు 259 పరుగులు జోడించాడు. తద్వారా పాంటింగ్ పేరిట ఉన్న అరుదైన రికార్డ్‌ను అధిగమించాడు. శ్రీలంక గడ్డపై నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన పర్యాటక టీమ్ జోడీగా స్మిత్-అలెక్స్ క్యారీ నిలిచారు. ఈ క్రమంలో మైకెల్ హస్సీ-షాన్ మార్ష్ 258 పరుగులు భాగస్వామ్య రికార్డ్‌ను స్మిత్-అలెక్స్ బ్రేక్ చేశారు. 2011లో పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో మైకెల్ హస్సీ-షాన్ మార్ష్ ఈ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

SL vs AUS Steve Smith Creates History during the second Test against Sri Lanka

స్మిత్-అలెక్స్ క్యారీ అసాధారణ బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది. విజయానికి చేరువలో ఉంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నేమన్, నాథన్ లయన్ మూడేసి వికెట్లు తీయగా.. ట్రావిస్ హెడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగుల భారీ స్కోర్ చేసింది. అలెక్స్ క్యారీ(188 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 156), స్టీవ్ స్మిత్(254 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 131) సెంచరీతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూరియా(5/151) ఐదు వికెట్లు తీయగా.. నిషన్ పీరిస్ మూడు, రమశ్ మెండీస్ రెండు వికెట్లు తీసారు.

157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక మూడో రోజు ముగిసే సమయానికి 62.1 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్(149 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 76), కుశాల్ మెండీస్(50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 48 బ్యాటింగ్) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాథ్యూ కుహ్నెమన్ నాలుగు వికెట్లు తీయగా.. నాథన్ లయన్ మూడు వికెట్లు పడగొట్టారు. బ్యూ వెబ్‌స్టర్ ఓ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం శ్రీలంక 54 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ఫస్ట్ సెషన్‌లోనే ఫలితం తేలనుంది.

Story first published: Saturday, February 8, 2025, 20:25 [IST]
Other articles published on Feb 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+