For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SL vs AUS: చెలరేగిన డేవిడ్ వార్నర్.. చిత్తయిన శ్రీలంక

SL vs AUS: David Warner and Finch helps Australia thrash Sri Lanka by 10 wickets

కొలంబో: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ దుమ్మురేపాడు. శ్రీలంక పర్యటనలో ఐపీఎల్ 2022 సీజన్ ఫామ్‌ను కొనసాగించిన డేవిడ్ భాయ్.. కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో కొలంబో వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఫలితంగా సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

India vs Australia 2nd T20I : MS Dhoni goes wrong with DRS call in Guwahati match | Oneindia News

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.3 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. జోష్ హేజిల్‌వుడ్‌ (4/16), మిచెల్‌ స్టార్క్‌ (3/26) సూపర్ బౌలింగ్‌తో లంక పతనాన్ని శాసించారు. లంక బ్యాటర్లలో అసలంక (38), నిశాంక (38), గుణతిలక (26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 11.5 ఓవర్లలో 100/1తో బలంగా కనిపించిన లంక.. ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి 28 పరుగులకే ఆఖరి 9 వికెట్లు కోల్పోయింది. లంక బ్యాటర్లలో ముగ్గురు డకౌటవ్వగా.. నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్‌ ( 44 బంతుల్లో 9 ఫోర్లతో 70 నాటౌట్), ఫించ్‌ ( 40 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 నాటౌట్‌) చెలరేగడంతో లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 14 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా అలవోకగా ఛేదించింది. ఈ ఓపెనింగ్ జోడీ ధాటికి లంక బౌలర్లు తేలిపోయారు. కనీసం ఒక్క వికెట్ తీయకుండా పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు.

Story first published: Wednesday, June 8, 2022, 8:03 [IST]
Other articles published on Jun 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+