Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL vs AUS: రఫ్ఫాడించిన తీక్షణ.. ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం!

ఆస్ట్రేలియాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన శ్రీలంక.. వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. రెండు వన్డేల సిరీస్‌లో భాగంగా కొలంబో వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన శ్రీలంక 49 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలింది. చరిల్ అసంలక(126 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్స్‌లతో 127) సెంచరీతో చెలరేగగా..దునిత్ వెల్లాలేగే(30) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సన్, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మాథ్యూ షార్ట్ ఓ వికెట్ తీసాడు.

SL vs AUS Charith Asalanka Maheesh Theekshana Star As Sri Lanka beat Australia

అనంతరం ఆస్ట్రేలియా 33.5 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. మార్నస్ లబుషేన్(41), ఆరోన్ హార్డీ(32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ(4/40) నాలుగు వికెట్లు తీయగా.. అసిత ఫెర్నాండో రెండు వికెట్లు, వానిందు హసరంగా, చరిత్ అసలంక తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, February 12, 2025, 18:42 [IST]
Other articles published on Feb 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+