Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL vs AUS: చరిత్ర సృష్టించిన అలెక్స్ క్యారీ.. 11 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆసియా గడ్డపై ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి ఆసీస్ వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ రికార్డ్‌ను అధిగమించాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ 156 పరుగులు చేశాడు.

ఈ భారీ శతకంతో 2004లో శ్రీలంక గడ్డపై ఆడమ్ గిల్ క్రిస్ట్ నమోదు 144 పరుగుల రికార్డ్‌ను అలెక్స్ క్యారీ అధిగమించాడు. అంతేకాకుండా ఆసియా గడ్డపై 150 ప్లస్ పరుగులు చేసిన నాన్ ఆసియా బ్యాటర్ల జాబితాలో చేరాడు. ఈ జాబితాలో జింబాబ్వే ప్లేయర్ ఆండీ ఫ్లవర్(232 నాటౌట్, 183 నాటౌట్), ఏబీ డివిలియర్స్ (164)‌లు అలెక్స్ క్యారీ(156) కంటే ముందుండగా.. టాటెండా టైబు(153), క్లైడ్ వాల్‌కట్(152), వారెన్ లీస్(152) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

SL vs AUS Alex Carey creates history as he shatters Adam Gilchrist s Asia record

ఈ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీతో పాటు కెప్టెన్ స్టీవ్ స్మిత్(254 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 131) సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగుల భారీ స్కోర్ చేసింది. దాంతో ఆ జట్టుకు 157 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూరియా(5/151) ఐదు వికెట్లు తీయగా.. నిషన్ పీరిస్ మూడు, రమశ్ మెండీస్ రెండు వికెట్లు తీసారు.

అనంతరం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మాథ్యూ కుహ్నేమన్ మూడు వికెట్లు తీయగా.. నాథన్ లయన్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 257 పరుగులకు కుప్పకూలిన విషయం తెలిసిందే. కుశాల్ మెండీస్(85 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నేమన్, నాథన్ లయన్ మూడేసి వికెట్లు తీయగా.. ట్రావిస్ హెడ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, February 8, 2025, 16:10 [IST]
Other articles published on Feb 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+