Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SL vs AUS: శ్రీలంకను ఆడుకున్న ఆడమ్ జంపా.. ఆసీస్ ముందు ఈజీ టార్గెట్

లక్నో: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా(4/47) చెలరేగాడు. నాలుగు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(67 బంతుల్లో 8 ఫోర్లతో 61), కుశాల్ పెరీరా(82 బంతుల్లో 12 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీల రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు తోడుగా మిచెల్ స్టార్క్(2/43), ప్యాట్ కమిన్స్(2/32) రెండేసి వికెట్లు తీసారు.

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. సూపర్ బ్యాటింగ్‌తో వేగంగా పరుగులు రాబట్టారు. దాంతో పవర్ ప్లేలో శ్రీలంక వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.

SL vs AUS: Adam Zampa scalps four as Australia bundle out Sri Lanka for 209

ఆ తర్వాత కూడా ఈ జోడీ నిలకడగా ఆడటంతో శ్రీలంక 17.4 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పాతుమ్ నిస్సంక 58 బంతుల్లో అర్థ శతకం అందుకున్నాడు. 125 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కమిన్స్ విడదీసాడు. పాతుమ్ నిస్సంకను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే సెంచరీ దిశగా సాగుతున్న కుశాల్ పెరీరాను కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

ఈ ఇద్దరు వెనుదిరగడంతో శ్రీలంక ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆడమ్ జంపా విజృంభించడంతో కుశాల్ మెండీస్(9), సదీర సమరవిక్రమా(8) పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో ఆటకు కాసేపు వర్షం అంతరాయం కలిగించింది.

బ్రేక్ అనంతరం ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. చరిత్ అసలంక(7)ను మ్యాక్స్‌వెల్ ఔట్ చేయగా.. డిసిల్వా(7)ను స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దునిత్ వెల్లలాగే(2) రనౌటవ్వగా.. చమిక కరుణరత్నే(2), మహీష్ తీక్షణలను జంపా ఔట్ చేశాడు. లాహిరు కుమారా(4)ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక కుప్పకూలింది.

Story first published: Monday, October 16, 2023, 18:40 [IST]
Other articles published on Oct 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+