SL vs AFG: ఉత్కంఠపోరులో గెలిచిన శ్రీలంక!
లాహోర్: ఆసియాకప్ 2023 సూపర్-4కు శ్రీలంక అర్హత సాధించింది. అఫ్గానిస్థాన్‌తో మంగళవారం జరిగిన ఉత్కంఠపోరులో శ్రీలంక 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-బి టాపర్‌గా టోర్నీలో ముందుంజ వేసింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ పోరాడి ఓడింది. క్వాలిఫై కోసం ధాటిగా ఆడిన అఫ్గాన్ చివరకు విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 291 పరుగులు చేసింది. కీపర్ కమ్ బ్యాటర్ కుశాల్ మెండీస్(84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92) తృటిలో శతకం చేజార్చుకోగా.. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరికి తోడుగా చరిత్ అసలంక(36), దునిత్ వెల్లేగే(33 నాటౌట్) రాణించారు.

అఫ్గానిస్థాన్ బౌలర్లలో గుల్బాదిన్ నబీ (4/60) నాలుగు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 37.4 ఓవర్లలో 289 పరుగులకు కుప్పకూలింది. టోర్నీలో ముందంజ వేయాలనే లక్ష్యంతో ధాటిగా ఆడిన అఫ్గాన్ చివరకు లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. మహమ్మద్ నబీ(32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65), హష్మతుల్లా షాహిదీ(66 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 59) రాణించినా ఫలితం లేకపోయింది.

చివర్లో రషీద్ ఖాన్(16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. శ్రీలంక బౌలర్లలో కాసున్ రజితా(4/79) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. దునిత్ వెల్లేలగే(2/36), ధనంజయ డిసిల్వా(2/12) రెండేసి వికెట్లు తీసారు. మహీష్ తీక్షణ, మహీష పతీరణ తలో వికెట్ పడగొట్టారు. టోర్నీలో ముందంజ వేయాలనే లక్ష్యంతో ధాటిగా ఆడిన అఫ్గాన్ విజయం సాధించలేకపోయింది. వరుసగా రెండు పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications