Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం మాథ్యూస్.. బ్యాడ్‌ లక్‌కే బ్రాండ్ అంబాసిడర్! ( వీడియో)

శ్రీలంక వెటరన్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్‌ను దురదృష్టం వెంటాడుతోంది. వన్డే ప్రపంచకప్‌లో టైమ్డ్‌ ఔట్‌గా వెనుదిరిగి చరిత్రకెక్కిన మాథ్యూస్.. మరోసారి విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. అఫ్గానిస్థాన్‌తో కొలంబో వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో మాథ్యూస్ బౌండరీ బాది మరి హిట్ వికెట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో చెలరేగిన మాథ్యూస్(141) చివరకు దురదృష్టకర రీతిలో వెనుదిరిగాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 102 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అఫ్గాన్ స్పిన్నర్ కైస్ అహ్మద్ వేసిన ఈ ఓవర్ రెండో బంతిని మాథ్యూస్ లెగ్ సైడ్ స్వీప్ షాట్ ఆడి బౌండరీకి తరలించాడు.

SL vs AFG: Angelo Mathews dismissed in bizarre way After timed-out in World Cup in Colombo Test

అయితే స్వీప్‌ను పూర్తి చేసే క్రమంలో అతని బ్యాట్ వికెట్లను తాకింది. బంతి ఎంత త్వరగా వెళ్లిందో.. అంతే వేగంగా మాథ్యూస్ ఔటయ్యాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Story first published: Sunday, February 4, 2024, 12:09 [IST]
Other articles published on Feb 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+