Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: రఫ్ఫాడించిన బుమ్రా, సిరాజ్.. కుప్పకూలిన వెస్టిండీస్!

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పేసర్లు మహమ్మద్ సిరాజ్(4/40), జస్‌ప్రీత్ బుమ్రా(3/42) నిప్పులు చెరిగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు కుప్పకూలింది. వెస్టిండీస్ బ్యాటర్లలో జస్టిన్ గ్రీవ్స్(48 బంతుల్లో 4 ఫోర్లతో 32), షైహోప్(36 బంతుల్లో 3 ఫోర్లతో 26), రోస్టన్ ఛేజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్‌కు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ ఇన్నింగ్స్‌ రెండు సెషన్లలోనే ముగిసింది.

Siraj and Bumrah Fire West Indies Crumble to 162 All Out Against India

నిప్పులు చెరిగిన సిరాజ్..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ తేజ్‌నారాయణ్ చందర్‌పాల్(0)‌ను సిరాజ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే జాన్ కాంప్‌బెల్‌(8)‌ను జస్‌ప్రీత్ బుమ్రా కీపర్ క్యాచ్‌గా ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్(13)‌ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. ఆచితూచి ఆడిన అలిక్ అథనాసియస్(12)ను క్యాచ్ ఔట్‌గా వెనక్కిపంపాడు. అతను కొట్టిన షాట్ నేరుగా స్లిప్‌లో ఉన్న కేఎల్ రాహుల్ చేతిలో పడింది.దాంతో వెస్టిండీస్ 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోస్టన్ ఛేజ్(22 బ్యాంటింగ్) షైహోప్(26) ఆచితూచి ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 48 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కుల్దీప్ యాదవ్ తన రెండో ఓవర్‌లోనే షైహోప్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ వికెట్ అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించడంతో వెస్టిండీస్ 90/5 స్కోర్‌తో తొలి సెషన్‌ను ముగించింది.

బూమ్ బూమ్ బుమ్రా..

రెండో సెషన్‌లోనూ సిరాజ్ నిప్పులు చెరిగాడు. క్రీజులో సెట్ అయిన కెప్టెన్ రోస్టన్ ఛేజ్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. జిడ్డుగా బ్యాటింగ్ చేసిన ఖారీ పిర్(11)ను వాషింగ్టన్ సుందర్ ఔట్‌చేయగా.. హాఫ్ సెంచరీ దిశగా సాగిన జస్టిన్ గ్రీవ్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్‌లో జోహన్ లేన్(1) కూడా బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. జోమెల్ వార్నికన్(8)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌‌కు తెరదించాడు. అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించగా.. మూడో సెషన్‌లో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది.

Story first published: Thursday, October 2, 2025, 14:28 [IST]
Other articles published on Oct 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+