Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనే ఇంగ్లండ్ కొంపముంచాడు: దిగ్గజ క్రికెటర్

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో వైఫల్యమే ఇంగ్లండ్ పతనాన్ని శాసించిందని ఆ జట్టు మాజీ ఓపెనర్, దిగ్గజ క్రికెటర్ జెఫ్రే బాయ్‌కాట్‌ తెలిపాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్‌లో జానీ బెయిర్ స్టో ఇంగ్లండ్ పాలిట శత్రువుగా మారాడని విమర్శించాడు. రాంచీ వేదికగా సోమవారం ముగిసిన నాలుగు టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.

ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జానీ బెయిర్ స్టో దారుణంగా విఫలమయ్యాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 170 పరుగులే చేశాడు. ఇందులో అత్యధిక స్కోర్ 38 పరుగులే. బెయిర్ స్టో వైఫల్యంపై ఓ దినపత్రికకు రాసిన కాలమ్‌లో బాయ్‌కట్ స్పందించాడు. రాంచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అతని వైఫల్యం ఇంగ్లండ్ పతనాన్ని శాసించిందని పేర్కొన్నాడు.

Sir Geoffrey Boycott slams Jonny Bairstows struggles in IND vs ENG Tests

'ఇంగ్లండ్ ప్రధాన బ్యాటర్లు జోరూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యారు. బెయిర్ స్టో అయితే చెత్త ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉన్నాడు. అతనికి అతనే శత్రువు. రాంచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అతను అద్భుతమైన డ్రైవ్స్ ఆడాడు. కానీ అంతలోనే పిచ్చిగా స్వీప్ షాట్ ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. స్టంప్స్ లైన్‌లో స్వీప్ ఆడి డీఆర్‌ఎస్‌లో దొరికిపోయాడు.

రెండో ఇన్నింగ్స్‌లో బెయిర్ స్టో ఆడినట్లు ఎప్పుడూ ఆడవద్దు. బంతి టర్న్ అవుతూ.. తక్కువ ఎత్తులో వస్తున్నప్పుడు హార్డ్ హ్యాండ్స్‌తో ఆడకూడదు. కానీ బెయిర్ స్టో.. రెండో ఇన్నింగ్స్ టీ బ్రేక్ అనంతరం ఎదుర్కొన్న తొలి బంతినే హార్డ్ హ్యాండ్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ సిరీస్‌లో పేలవ బ్యాటింగే ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది.

జోరూట్ తన పాత పద్దతిలో బ్యాటింగ్ చేసి శతకం సాధించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే మళ్లీ దూకుడుగా ఆడుతవా? అని ప్రశ్నిస్తే ర్యాంప్ షాట్స్ ఆడుతానని బదులిచ్చాం. నా ఉద్దేశం ప్రకారం అతని ఈ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం.'అని బాయ్‌కాట్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, February 26, 2024, 22:04 [IST]
Other articles published on Feb 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+