Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

37 ఏళ్ల వయసులో అద్భుతం.. 10 వికెట్లు తీసి కన్నీళ్లు పెట్టుకున్న స్పిన్నర్!

క్రికెట్ స్టేడియంలో పట్టుదల, నిరంతర శ్రమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు దక్షిణాఫ్రికా సీనియర్ ఆఫ్-స్పిన్నర్ సైమన్ హార్మర్. ఆస్ట్రేలియాతో కేప్‌టౌన్‌లో జరిగిన నిర్ణయాత్మక టెస్టులో తన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలతో(10/120) ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసి దక్షిణాఫ్రికాకు 176 పరుగుల భారీ విజయాన్ని అందించారు.తొలి టెస్ట్ ఓటమి అనంతరం అద్భుతంగా పుంజుకున్న దక్షిణాఫ్రికా జట్టు ఈ విజయంతో 2-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ అభిషేక్ శర్మ?

టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ అభిషేక్ శర్మ?

మ్యాచ్ పూర్తయిన తర్వాత ప్రజెంటేషన్ వేడుకలో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న సైమన్ హార్మర్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. "నా ప్రయాణంలో ఎదురైన అనుభవాలే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టాయి. నా కెరీర్లో దేనిని మార్చుకోవాలని నేను అనుకోవడం లేదు. ప్రతీ ఎదురుదెబ్బ నాకు ఓ పాఠాన్ని నేర్పింది." అని పేర్కొన్నారు. 2015 భారత పర్యటన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు నుంచి తొలగింపుకు గురైన సైమన్ హార్మర్.. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో ఎసెక్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించి అత్యుత్తుమ స్పిన్నర్‌గా ఎదిగారు. ఏళ్ల తరబడి దూరమైనప్పటికీ.. సడలని పట్టుదలతో 2022లో తిరిగి జాతీయ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చారు.

Simon Harmer Takes 10 Wickets vs Australia South Africa Win Cape Town Test and Claim Series

ఈ టెస్టులో దక్షిణాఫ్రికా విజయంలో సైమన్ హార్మర్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే ఆలౌట్ అయింది. సైమన్ హార్మర్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టారు. ఇది సైమన్ హార్మర్ కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ గణాంకాలు 16 పరుగులకు 6 వికెట్లు కాగా.. ఈ మ్యాచ్ మొత్తం 120 పరుగులకు 10 వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది.

చివరి రోజు ఆస్ట్రేలియా ముందు 288 పరుగుల లక్ష్యం ఉండగా.. దక్షిణాఫ్రికాకు 10 వికెట్లు అవసరమయ్యాయి. తొలి ఓవర్లోనే స్టార్ పేసర్ కగిసో రబాడ వరుసగా రెండు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత పిచ్‌పై లభించిన స్పిన్ అనుకూలతను వాడుకుంటూ సైమన్ హార్మర్ తన వేగం, లైన్ అండ్ లెంగ్త్, డెలివరీ కోణాలను మారుస్తూ ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేసి ఇన్నింగ్స్‌ను చుట్టేశారు.

శ్రీలంక, ఉగాండా చిత్తు.. భారత్ డబుల్ ధమాకా!

Also Read

శ్రీలంక, ఉగాండా చిత్తు.. భారత్ డబుల్ ధమాకా!

ఈ కేప్‌టౌన్‌ విజయంతో ఐసీసీ డబ్ల్యూటీసీ పట్టికలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పట్టికలో న్యూజిలాండ్ నంబర్ 1 స్థానానికి చేరుకోగా.. టీమిండియా పాయింట్ల పరంగా ప్రయోజనం పొందింది. అలాగే సుదీర్ఘ కాలం పాటు(1683 రోజులు) ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగిన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మరో వైపు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మెడ గాయంతో ఇబ్బంది పడుతుండగా.. స్కానింగ్‌లో తీవ్రమైన సమస్య ఉన్నట్లు వెల్లడైంది.

Story first published: Sunday, November 1, 2026, 11:53 [IST]
Other articles published on Nov 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+