For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Simon Doull: డారిల్ మిచెల్ ఆట.. ధోనీ చెప్పిన ఆ మాటలను గుర్తు చేసింది!

Simon Doull says Daryl Mitchells knock reminded him of MS Dhoni once told him about finishing the game

అబుదాబి: 'డారిల్ మిచెల్' టీ20 ప్రపంచకప్ ముందు వరకు ఎవరికీ పెద్దగా తెలియని పేరు. కానీ బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో సూపర్ బ్యాటింగ్‌తో రాణించిన డారిల్ మిచెల్ న్యూజిలాండ్‌కు అద్భుత విజయాన్నందించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి అజేయ హాఫ్ సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. లక్ష్యచేధనలో 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డేవాన్ కాన్వేతో కలిసి గట్టెక్కించాడు. చివర్లో జిమ్మీ నీషమ్ ధాటైన ఇన్నింగ్స్ సాయంతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

దాంతో అతని పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది. అయితే మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్న సమయంలో కామెంటేటర్‌గా ఉన్న న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. మిచెల్ ఆటను చూస్తుంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనతో చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయన్నాడు.

 చివరి వరకు ఆడితే..

చివరి వరకు ఆడితే..

'మహేంద్ర సింగ్ ధోనీ గొప్ప ఆటగాడే కాకుండా మంచి ఫినిషర్. ఒకసారి అతను నాతో మాట్లాడుతూ.. చేజింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలన్నాడు. అలా చివరి వరకు బ్యాటింగ్ చేస్తే.. ప్రత్యర్థి జట్టు బౌలర్లు కలవరపాటుకు గురవుతారు. బౌలర్లపై ఒత్తిడి పెరిగి మనకు అవకాశం దొరుకుతుందని చెప్పాడు. ఈ రోజు డారిల్ మిచెల్ అదే చేశాడు. న్యూజిలాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా ఓపికగా బ్యాటింగ్ చేసి చివర్లో ధాటిగా ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చాడు'అని సైమన్ డౌల్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

భారత ఆటగాళ్లు సైతం..

భారత ఆటగాళ్లు సైతం..

సైమన్ డౌలే కాకుండా ధోనీ చెప్పిన ఈ ఫార్మూలాను భారత ఆటగాళ్లు చాలా వరకు పాటించి విజయాలు సాధించారు. ధోనీ సైతం 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో అదే చేయబోయాడు. కానీ దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరగడంతో ఆ మ్యాచ్‌లో భారత్ విజయాన్నందుకోలేకపోయింది. ఇక ఐపీఎల్‌లో చాలా సార్లు రవీంద్ర జడేజా ఇదే ఫార్మూలాతో బ్యాటింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్‌కు విజయాలందించాడు. ఎన్నో సార్లు తన ఇన్నింగ్స్ క్రెడిట్ ధోనీదేనని కూడా చెప్పుకొచ్చాడు. ఆ టైమ్‌లో అతను కూడా ధోనీ చెప్పిన ఇదే ఫార్మూలాను ప్రస్తావించాడు. వీలైనంత వరకు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని ధోనీ ఎప్పుడూ చెబుతుంటాడని పేర్కొన్నాడు.

 16 ఓవర్ల వరకు..

16 ఓవర్ల వరకు..

కివీస్‌ లక్ష్యఛేదనలో 16 ఓవర్ల దాకా ఇంగ్లండ్‌దే పైచేయి. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆ జట్టు ఆఖర్లో ఒత్తిడికి చిత్తయ్యింది. చివరి మూడు ఓవర్లు, నీషమ్‌ మెరుపులు మోర్గాన్‌ బృందం ఆశలను తలకిందులు చేశాయి. దీంతో ఇంకో ఓవర్‌ మిగిలుండగానే న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తమకు ఐసీసీ ప్రపంచకప్‌లను దూరం చేస్తున్న ఇంగ్లండ్‌ను ఈ మెగా ఈవెంట్‌ సెమీఫైనల్లో కివీస్‌ కసిదీరా ఓడించి మరీ ఫైనల్‌ చేరింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్), డేవిడ్ మలాన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీశారు.

జిమ్మీ మెరుపులతో..

జిమ్మీ మెరుపులతో..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసి 6 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ డరిల్ మిచెల్(47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అతనికి అండగా డేవాన్ కాన్వే(38 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించాడు.

ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 82 పరుగుల జోడించారు. 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సమయోచిత బ్యాటింగ్‌తో విజయతీరాలకు చేర్చారు. చివర్లో జిమ్మీ నీషమ్(11 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27) పవర్ హిట్టింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్ స్టోన్ రెండేసి వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Thursday, November 11, 2021, 17:37 [IST]
Other articles published on Nov 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+