బాబర్ ఆజామ్ రికార్డుల కోసం ఫ్లాట్ పిచ్‌లా? పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై న్యూజిలాండ్ మాజీ పేసర్ ఫైర్!

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ మండి పడ్డాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు తయారు చేసిన పిచ్‌లపై అసహనం వ్యక్తం చేశాడు. బాబర్ ఆజామ్ రికార్డుల కోసం పసలేని ఫ్లాట్ పిచ్‌లు తయారు చేస్తున్నారా? అని ప్రశ్నించాడు.
ఫ్లాట్ వికెట్ కారణంగా న్యూజిలాండ్ - పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టులో ఫలితం తేలలేదు. బౌలర్లకు ఏ మాత్రం సహకరించిన ఈ పిచ్‌పై
2021 నుంచి సెంచరీ ముఖం చేయని కివీస్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు.

ఫ్లాట్ వికెట్లతో..
కరాచీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కూడా పాకిస్థాన్ మరోసారి ఫ్లాట్ పిచ్‌నే తయారు చేయించింది. ఈ మ్యాచ్ లో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 408 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కివీస్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల ఆట పూర్తవ్వడంతో ఈ మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం లేదు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ వికెట్‌పై సైమన్ డౌల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఈ పిచ్‌లు తయారు చేయమని చెబుతోంది ఎవరని మండిపడ్డాడు.

బాబర్ ఆజామ్ కోసమేనా..?
'అసలు పాకిస్థాన్‌లో పిచ్‌లు తయారు చేసేవాళ్లకు ఈ ఆదేశాలు ఎవరిస్తున్నారు? ఇవి కెప్టెన్ బాబర్ ఆజామ్ నుంచి వస్తున్నాయా? ఈ సిమెంట్ రోడ్ల మీద బాగా ఆడి సెంచరీలు చేసి తన గణాంకాలు మెరుగుపరుచుకోవాలని అతడు చూస్తున్నాడా.? తద్వారా తనకంటే పైన ఉన్నవాళ్లను అధిగమించేందుకు యత్నిస్తున్నాడా.? అసలేం జరుగుతుంది..?'అని సైమన్ డౌల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ..
తమకు అనుకూలంగా ఉండే వికెట్లతో క్రికెట్ ప్రపంచం ముందు పాకిస్థాన్ అబాసుపాలు అవుతోంది. గతేడాది ఆస్ట్రేలియాతో రావల్పిండి వేదికగా ముగిసిన టెస్టుతో పాటు కరాచీ, ముల్తాన్ లలో అన్నీ ఫ్లాట్ పిచ్ లే తయారుచేసింది. బ్యాటర్లు పండుగ చేసుకున్న ఈ పిచ్ పై బౌలర్లు బంతులు విసిరి విసిరి అలిసిపోయారే తప్ప వికెట్లు మాత్రం తీయలేకపోయారు. సాక్షాత్తు ఐసీసీ కూడా ఈ విషయంలో పాకిస్తాన్ ను మందలించింది. ఈ పిచ్ లకు 'బిలో యావరేజ్' రేటింగ్ ఇచ్చింది.
ఒక్కరోజే ఇంగ్లండ్ 506 రన్స్..
ఇటీవలే ఇంగ్లండ్ తో ముగిసిన మూడు టెస్టుల్లో కూడా పాకిస్థాన్‌ది అదే తీరు. రావల్పిండి టెస్టులో అయితే తొలి రోజే ఇంగ్లండ్ ఏకంగా 506 పరుగులు చేసి 108 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టింది. దీంతో పాక్ పిచ్ లు తయారుచేయాల్సింది పోయి సిమెంట్ రోడ్లు వేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ బజ్ బాల్ కాన్సెప్ట్‌తో ఫలితం రాబట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications