Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: షార్జాలో మ్యాచ్ అంటే వణుకుతున్నారా? టీమిండియాపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Sikander Bakht controversial claim India only play in Dubai, are you afraid of going to Sharjah?

కరాచీ: ఆసియాకప్ 2022లో చిరకాల ప్రత్యర్థులు భారత్ X పాకిస్థాన్ మరోసారి తలపడేందుకు సిద్దమయ్యాయి. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే సూపర్ 4 మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. దుబాయ్ వేదికగా గత ఆదివారం(ఆగస్టు 28) జరిగిన లీగ్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన భారత్.. మరోసారి అదే వేదికపై గెలిచేందుకు సిద్దమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమతో యూఏఈలో మ్యాచ్ ఆడాలంటే భారత్.. దుబాయ్ స్టేడియాన్నే కోరుకుంటుందని, షార్జా మైదానంలో ఆడేందుకు ఏమాత్రం సిద్దపడటం లేదన్నాడు. షార్జాలో తమతో ఆడేందుకు భారత జట్టు భయపడుతుందా? అని ప్రశ్నించాడు.

అక్కడ ఆడాలంటే భయమా?

అక్కడ ఆడాలంటే భయమా?

ఇది తన ప్రశ్న కాదని.. యావత్ పాకిస్థాన్ తెలుసుకోవాలని అనుకుంటుందని చెప్పాడు. పాకిస్తాన్ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చలో భాగంగా సికందర్ ఈ ప్రశ్న వేశాడు. ఈ టీవీ చర్చలో సికందర్ తో పాటు ఇంజమామ్ ఉల్ హక్ కూడా ఉన్నాడు. భారత్ నుంచి కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, అతుల్ వాసన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సికందర్ మాట్లాడుతూ.. 'యూఏఈలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడాలంటే భారత్ దుబాయ్‌నే ఎందుకు ఎంచుకుంటుంది.? షార్జా, అబుదాబిలో ఎందుకు ఆడటం లేదు.

తమకు అచ్చిరాదు..

తమకు అచ్చిరాదు..

వాస్తవానికి ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్ కూడా షార్జాలో జరగాలి. కానీ దానిని బీసీసీఐ తన పలుకుబడిని ఉపయోగించి దుబాయికి మార్పించింది. ఎందుకిలా..? మాతో మ్యాచ్ అంటే భయపడుతున్నారా? నేను ఈ ప్రశ్న నా సొంతంగా అడగడం లేదు. పాకిస్థాన్ ప్రజానీకం తరఫున అడుగుతున్నా.' అని ప్రశ్నించాడు. దీనికి కపిల్ దేవ్, మహమ్మద్ అజారుద్ధీన్‌లు స్పందించకపోయినా అతుల్ వాసన్ మాత్రం కౌంటర్ ఇచ్చాడు. షార్జా పిచ్ తమకు అచ్చిరాదని చెప్పాడు. 'షార్జా మైదానం మాకు అంత మంచిదికాదు. ఇప్పుడు మేం ఐసీసీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. అందుకే మేము అక్కడ ఆడటం లేదు.'అని నవ్వుతూ కౌంటర్ ఇచ్చాడు.

ఆ ఫైనల్ పరాభావంతో..

ఆ ఫైనల్ పరాభావంతో..

ఇక 1986లో షార్జా వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్.. పాకిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ విజయంతో పాక్ తొలి ఆసియా కప్‌ను గెలుచుకుంది. పాకిస్థాన్ దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్ ఆఖరు బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. అప్పట్నుంచి భారత్ అక్కడ పెద్దగా మ్యాచ్‌లు ఆడటం లేదు. యూఏఈలో ఆడుతున్నా దుబాయ్, అబుదాబి వేదికగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతున్నది. ప్రస్తుతం ఆసియా కప్‌లో కూడా ఇతర జట్లు షార్జాలో ఆడుతున్నా.. టీమిండియా మ్యాచులన్నీ దుబాయ్ వేదికగానే జరుగుతుండటం విశేషం.

Story first published: Sunday, September 4, 2022, 16:40 [IST]
Other articles published on Sep 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+