Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: చెత్త పిచ్ వల్లే ఓడిపోయాం: జింబాబ్వే కెప్టెన్

నాసిరకం పిచ్ కారణంగానే భారత్‌తో తొలి టీ20లో ఓటమిపాలయ్యామని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తెలిపాడు. పిచ్‌పై తేమ ఉండటంతో బ్యాటింగ్ చేయడం కష్టమైందని, కానీ భారత బ్యాటింగ్ సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిందని పేర్కొన్నాడు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సికిందర్ రాజా.. పవర్ ప్లేలో దూకుడుగా ఆడకపోవడం విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా మరుమాని, మధెవెరెల బ్యాటింగ్ తమకు సానుకూల అంశమని పేర్కొన్నాడు.

Sikandar Raza Blames Moisture-Laden Pitch for Zimbabwe s Defeat in 1st T20I against India

ఇది నాసిరకం పిచ్..

'ఈ పిచ్ నాణ్యత ఆశించిన స్థాయిలో లేదు. పిచ్‌లోని తేమ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. తేమ ప్రభావం అంత ఎక్కువసేపు ఉంటుందని నేను అనుకోలేదు. తేమ ఎక్కువగా ఉండటంతో కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. దురదృష్టవశాత్తూ.. ఆరంభంలో మేం ఎక్కువ బౌండరీ కొట్టలేకపోయాం. దాంతో బంతి చాలా సేపు కొత్తగానే ఉంది. పిచ్ నుంచి మూమెంట్ కూడా లభించడంతో బ్యాటింగ్ చేయడం మరింత కష్టమైంది.

IND vs ZIM: బుడ్డోడి విధ్వంసం.. టీమిండియా ఘన విజయం! మలుపు తిప్పిన పేస్ సెన్సేషన్!

IND vs ZIM: బుడ్డోడి విధ్వంసం.. టీమిండియా ఘన విజయం! మలుపు తిప్పిన పేస్ సెన్సేషన్!

బంగ్లాదేశ్‌తో గత వన్డే సిరీస్‌లో కూడా తేమ ఇలానే ఉంది. కానీ అది చాలా సమయం ఉంది. నేటి మ్యాచ్‌లో మాత్రం 8 నుంచి 12 ఓవర్ల వరకే ఉంది. ఆ తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ముఖ్యంగా భారత బ్యాటింగ్ సమయంలో మరింత ఈజీగా మారిపోయింది. తదుపరి మ్యాచ్‌కు మంచి పిచ్ లభిస్తుందని ఆశిస్తున్నా. అప్పుడు మ్యాచ్‌లో టాస్ ఓడినా పెద్దగా ప్రభావం ఉండదు.

వారి బ్యాటింగే సానుకూలాంశం..

ఈ మ్యాచ్‌లో మాకు లభించిన ఏకైక సానుకూల అంశం. మరుమాని, మధెవెరెల బ్యాటింగ్. అద్భుతమైన బ్యాటింగ్‌తో మాకు గౌరవప్రదమైన లక్ష్యాన్ని అందించారు. వారితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా రాణిస్తే మేం పోరాడే లక్ష్యాన్ని సాధించగలం.'అని సికిందర్ రజా చెప్పుకొచ్చాడు.

వైభవ్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులే చేసింది. వెస్లీ మధెవెరే(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 39), తడివానషే మరుమాని(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్(2/18), ప్రిన్స్ యాదవ్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. శివమ్ దూబే, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

అబ్బర బిడ్డో.. ఇన్నింగ్స్ ఫస్ట్‌ బాల్‌కే వికెట్!గంటకు 150 కిలోమీటర్ల వేగం..!(వీడియో)

అబ్బర బిడ్డో.. ఇన్నింగ్స్ ఫస్ట్‌ బాల్‌కే వికెట్!గంటకు 150 కిలోమీటర్ల వేగం..!(వీడియో)

అనంతరం భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 126 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 3 ఫోర్లతో 28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ రెండు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Thursday, July 23, 2026, 21:19 [IST]
Other articles published on Jul 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+