Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌ను ఓడిస్తాం.. వైభవ్‌పై విమర్శలు సరికాదు: జింబాబ్వే కెప్టెన్

మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ను ఓడిస్తామని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అన్నాడు. ఈ సిరీస్‌ గెలిచే అవకాశాలు ఇరు జట్లకు సమంగా ఉన్నాయని చెప్పాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై విమర్శలు చేయడం సరికాదని, అతను ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడని తెలిపాడు. వైభవ్‌ను జాగ్రత్తగా చూసుకుంటే ఈ తరం మేటీ క్రికెటర్‌గా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు.

IND vs ZIM టీ20 సిరీస్: జియోస్టార్, సోనీ టీవీలో రాదు.. ఎలా చూడాలంటే?

IND vs ZIM టీ20 సిరీస్: జియోస్టార్, సోనీ టీవీలో రాదు.. ఎలా చూడాలంటే?

ఇంగ్లండ్ పర్యటనను ముగించుకున్న టీమిండియా మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం(జూలై 23)న హరారే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన సికిందర్ రాజా.. ఈ సిరీస్ ఏ మాత్రం ఏకపక్షంగా సాగదని తెలిపాడు.

Sikandar Raza backs Vaibhav Sooryavanshi Says Criticising him after two or three matches isn t justified

భారత్‌ను ఓడిస్తాం..

'ఈ టీ20 సిరీస్‌ గెలిచేందుకు భారత్, జింబాబ్వేకు సమాన అవకాశాలున్నాయి. జింబాబ్వే నిలకడగా ఆడుతోంది. భారత బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. వాళ్లు ఫామ్‌లో ఉంటే మమ్మల్ని చిత్తు చేస్తారు. కానీ ఫియర్‌లెస్ క్రికెట్ ఆడేటప్పుడు కొన్నిసార్లు విజయం దక్కకపోవచ్చు.

అలా సాధ్య కానప్పుడు, భారీ స్కోర్ చేయనప్పుడు ఇతర జట్టుకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మేం సద్వినియోగం చేసుకుంటాం. ప్రస్తుతం టీమిండియా ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉంది. జింబాబ్వేది కూడా అదే పరిస్థితి. ప్రస్తుత సిరీస్ కచ్చితంగా ఏకపక్షంగా సాగదు.'అని సికిందర్ రజా చెప్పుకొచ్చాడు.

IND vs ZIM: బేబీ బాస్ రీఎంట్రీ.. జింబాబ్వేతో తలపడే భారత తుది జట్టు ఇదే!

IND vs ZIM: బేబీ బాస్ రీఎంట్రీ.. జింబాబ్వేతో తలపడే భారత తుది జట్టు ఇదే!

వైభవ్‌ను విమర్శించొద్దు..

టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడని, అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సికిందర్ రజా సూచించాడు. 'వైభవ్ సూర్యవంశీ టాలెంటెడ్ ప్లేయర్. 15 ఏళ్ల పిల్లాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పుడు తొలి 3 మ్యాచ్‌ల్లో విఫలమైతే విమర్శించడం సరికాదు. వైభవ్ చుట్టూ ఎంతో మంది సీనియర్ ఆటగాళ్లు ఉన్నాడు. అతన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఈ తరం మేటి క్రికెటర్‌గా ఎదుగుతాడు.

గతేడాది కాలంలో అతను సాధించిన ఘనతలు, అండర్ 19 టీమ్ తరఫున ఆడిన తీరు, 15 ఏళ్లకే అంతర్జాతీయ అరంగేట్రం చేయడం చిన్న విషయాలేం కాదు. వైభవ్ సూర్యవంశీ ఎంతో ప్రత్యేకం. అతన్ని ఎలా చూసుకుంటారు, పర్యవేక్షిస్తారనేదే ముఖ్యం.'అని సికిందర్ రజా చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ 14, 13, 15 పరుగులే చేసి నిరాశపర్చాడు. దాంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. ఈ వైఫల్యంతో అతనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఫ్లాట్ వికెట్లపై ఆడినట్లు కాదని సెటైర్లు పేల్చారు. తన సత్తా నిరూపించుకునేందుకు వైభవ్‌కు జింబాబ్వే పర్యటన మంచి అవకాశం.

Story first published: Wednesday, July 22, 2026, 9:40 [IST]
Other articles published on Jul 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+