Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెయిలెండర్‌ను ఔట్ చేసి గొప్పలు చెబుతున్నాడా.. కమిన్స్‌పై శుభ్‌మన్ గిల్ సెటైర్స్! (వీడియో)

షార్ట్ పిచ్ బాల్స్‌తో టీమిండియాను కట్టడి చేశామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తనదైన శైలిలో స్పందించాడు. ఒక టెయిలెండర్‌ను ఔట్ చేసి గొప్పలు చెబుతున్నాడా? అని వ్యంగ్యంగా మాట్లాడాడు.

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగం ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌కు టీమిండియా సిద్దమైంది. శనివారం ఉదయం 5.50 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పాల్గొన్నారు.

Shubman Gill s brutal reply to Pat Cummins short ball plan against India in BGT

అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియాను షార్ట్ పిచ్ బాల్స్‌తో కట్టడి చేశామని, మరోసారి ఆ వ్యూహాన్ని అమలు చేస్తామని కమిన్స్ తెలిపాడు. ఈ వ్యాఖ్యలను శుభ్‌మన్ గిల్ ముందు ప్రస్తావించగా.. అతను తనదైన శైలిలో బదులిచ్చాడు. 'షార్ట్ బాల్ వ్యూహంతో ఆసీస్ ఫలితాన్ని రాబట్టిందా? నాకు తెలియదు. షార్ట్ బాల్‌‌తో వాళ్లు ఒక టెయిలెండర్‌ను మాత్రమే ఔట్ చేశారు. మరీ ఆ వ్యూహం ఎలా సక్సెస్ అయ్యిందో ఏమో'అని గిల్ వెటకారంగా సమాధానమిచ్చాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తాము తాజాగా ప్రారంభిస్తామని, మూడు టెస్ట్‌ల సిరీస్‌గా భావించి ఆడుతామని శుభమ్‌న్ గిల్ తెలిపాడు. 'ఒక్కసారి కూడా గెలవకపోతే బాధపడాలి. కానీ గత పర్యటనలో మేం ఇక్కడ విజయం సాధించాం. భారత గడ్డపై అదే జోరు కొనసాగించాం. ప్రత్యర్థి బౌలర్ ఎవరా? అనేది ఈ జనరేషన్‌కు అనవసరం. బంతిని చూసి ఆడటమే తెలుసు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌ అంతా బాగుంది. జట్టంతా కలిసి డిన్నర్ చేశాం. ఎంతో సరదాగా గడిపాం. అడిలైడ్‌లో మేం ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే ఈ పరాజయంతో ఆందోళన పడటం లేదు. ఇక నుంచి మూడు టెస్ట్‌ల సిరీస్‌గా భావించి ఆడుతాం.

గబ్బా టెస్ట్‌‌లో గెలిస్తే.. మెల్‌బోర్న్, సిడ్నీలోనూ పైచేయి సాధిస్తాం. గత సిరీస్‌లోనూ అడిలైడ్‌లో మాకు ఓ పరాజయం ఎదురైంది. కానీ ఆ తర్వాత మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్నాం. ఇప్పుడూ కూడా అదే సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతాం. గబ్బాలో మాకు మెరుగైన రికార్డ్ ఉంది. ఇక్కడికి రాగానే మైదానం మొత్తం తిరిగాం. ఇక్కడ మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పిచ్ కూడా బాగుంటుంది.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, December 13, 2024, 21:14 [IST]
Other articles published on Dec 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+