For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గిల్ X కోహ్లీ X సచిన్.. తొలి 37 టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు, సెంచరీలు చేసింది ఎవరంటే?

టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. ఇంగ్లండ్ పర్యటనలో అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా సత్తా చాటాడు. ఐదు టెస్ట్‌ల్లో 754 పరుగులు చేసి ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఇంకాస్త మెరుగవ్వాలి. కానీ బ్యాటర్‌గా మాత్రం 37 టెస్ట్‌ల్లోనే అత్యున్నతమైన గణంకాలను నమోదు చేశాడు. భారత ఆల్‌టైమ్ గ్రెటెస్ట్ బ్యాటర్లు అయిన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ బాటలో గిల్ నడుస్తున్నాడు. ఈ క్రమంలోనే తొలి 37 టెస్ట్ మ్యాచ్‌ల్లో సచిన్, విరాట్ కోహ్లీ ఎలా రాణించారో ఓ లుక్కెద్దాం.

పరుగుల్లో కోహ్లీనే టాప్..

శుభ్‌మన్ గిల్ 37 టెస్ట్‌ల్లో 41.35 సగటుతో 2647 పరుగులు చేశాడు. అదే దశలో విరాట్ కోహ్లీ 37 టెస్ట్‌ల్లో 45 సగటుతో 2794 రన్స్ రాబట్టాడు. సచిన్ మాత్రం 37 టెస్ట్‌ల్లో 52 సగటుతో 2481 పరుగులు చేశాడు. కోహ్లీ, గిల్ కంటే సచిన్ చేసిన పరుగులు తక్కువ. కానీ సగటు ఎక్కువ. ఈ 37 టెస్ట్‌ల్లో శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తోనే 15 మ్యాచ్‌లు ఆడి 1346 పరుగులు, ఆస్ట్రేలియాతో 9 టెస్ట్‌ల్లో 537 పరుగులు, న్యూజిలాండ్‌తో ఐదు టెస్ట్‌ల్లో 324 పరుగులు, బంగ్లాదేశ్‌తో 4 టెస్ట్‌ల్లో 321 పరుగులు చేశాడు.

Shubman Gill vs Virat Kohli vs Sachin Tendulkar A Statistical Comparison After 37 Test Matches

విరాట్ కోహ్లీ మాత్రం ఆస్ట్రేలియాతో 12 టెస్ట్‌ల్లో 1226 రన్స్, న్యూజిలాండ్‌తో నాలుగు టెస్ట్‌ల్లో 426 పరుగులు, ఇంగ్లండ్‌తో 9 టెస్ట్‌ల్లో 322, సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల్లో 272 పరుగులు చేశాడు. మరోవైపు సచిన్ టెండూల్కర్.. ఇంగ్లండ్‌తో 6 టెస్ట్‌ల్లో 542, శ్రీలంకతో 7 టెస్ట్‌ల్లో 458, వెస్టిండీస్‌తో మూడు టెస్ట్‌ల్లో 402 పరుగులు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల్లో 368 పరుగులు చేశాడు. సచిన్, శుభ్‌మన్ గిల్ కంటే విరాట్ కోహ్లీ కఠినమైన ప్రత్యర్థులతో తలపడ్డాడు.

సెంచరీల్లోనూ కింగే..

37 టెస్ట్‌ల్లో శుభ్‌మన్ గిల్ 9 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు నమోదు చేస్తే.. విరాట్ కోహ్లీ మాత్రం 11 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు బాదాడు. అదే దశలో సచిన్ టెండూల్కర్ 8 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. సెంచరీల విషయంలోనూ గిల్, సచిన్ కం టే కోహ్లీనే టాప్‌లో ఉన్నాడు.

ఈ 37 టెస్ట్‌ల్లో సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 16 మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ 42 సగటుతో 1268 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉండగా.. ఇంగ్లండ్‌పైనే సాధించాడు. విరాట్ కోహ్లీ మాత్రం తొలి 37 టెస్ట్‌ల్లో 17 మ్యాచ్‌లు సెనా దేశాల్లో ఆడాడు. 48 సగటుతో 1612 పరుగులు చేశాడు.

ఇందులో ఏడు శతకాలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ కూడా సెనా దేశాల్లో 16 టెస్ట్‌లు ఆడి 42 సగటుతో 986 పరుగులే చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏ లెక్కన చూసుకున్నా.. తొలి 37 టెస్ట్‌ల తర్వాత శుభ్‌మన్ గిల్, సచిన్ కంటే విరాట్ కోహ్లీకే మెరుగైన రికార్డ్ ఉంది.

Story first published: Tuesday, August 19, 2025, 11:02 [IST]
Other articles published on Aug 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+