Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: శుభ్‌మన్ గిల్

తొలి మూడు ఓవర్లతో పాటు మిడిల్‌ ఓవర్లలో పరుగులు చేయకపోవడం తమ పతనాన్ని శాసించిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు కావాల్సిన అవకాశాలు లభించాయని, కానీ తాము అందిపుచ్చుకోలేకపోయామని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుత బౌలింగ్‌తో తమ పతనాన్ని శాసించాడని తెలిపాడు. 'బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాకు విజయవకాశాలు దక్కాయి. కానీ మేం అందిపుచ్చుకోలేకపోయాం. ముందుగా బౌలింగ్‌లో ఇవ్వాల్సిన పరుగుల కంటే ఎక్కువ ఇచ్చాం. ఫీల్డింగ్‌లో కూడా తప్పిదాలు చేశాం. బ్యాటింగ్‌లో తొలి మూడు ఓవర్లతో పాటు మిడిల్‌‌లో మరో మూడు ఓవర్లలో 18 పరుగులే చేశాం. ఈ రెండు తప్పిదాలు మా ఓటమిని శాసించాయి. ఈ మ్యాచ్‌లో ఓడినా మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి.

Shubman Gill Says we didn t score in the middle overs that costed us after PBKS beat GT in IPL 2025

ఈ టోర్నీకి ఇది ఘన ఆరంభం అనుకుంటున్నా. విజయ్ కుమార్ వైశాఖ బౌలింగ్ అద్భుతం. 15 ఓవర్ల పాటు బెంచ్‌పై కూర్చొని ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా వచ్చి వైడ్ యార్కర్లు వేయడం ఆశమాషి వ్యవహారం కాదు. అతని వైడ్ యార్కర్లకే ఈ గెలుపు క్రెడిట్ ఇవ్వాలి. ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే వికెట్. 240-250 పరుగులు చేయవచ్చు. కానీ ప్రత్యర్థిని కూడా అదే రీతిలో కట్టడి చేయాలి.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), శశాంక్ సింగ్(16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసి ఓటమిపాలైంది.

సాయి సుదర్శన్(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74), జోస్ బట్లర్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. షెఫ్రెన్ రూథర్‌పోర్డ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన విజయ్‌కుమార్ వైశాఖ్.. మిడిల్ ఓవర్లలో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 10 పరుగులే ఇచ్చాడు.

Story first published: Wednesday, March 26, 2025, 0:10 [IST]
Other articles published on Mar 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+