తప్పంతా వాళ్లదే.. మాకు గెలిచే అర్హత లేదు: శుభ్‌మన్ గిల్
సునాయస క్యాచ్‌లను వదిలేయడంతోనే ఓటమిపాలయ్యామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. పిచ్‌కు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించినా చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం కోల్‌కతా వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సమష్టిగా రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 29 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.
ఈ ఓటమి మంచిదే..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. ప్లే ఆఫ్స్ ముంగిట ఎదురైన ఈ పరాజయం ఒకరకంగా తమకు మంచిదేనని అభిప్రాయపడ్డాడు. తమ జట్టు ఫీల్డింగ్ మెరుగవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 'ఈ పిచ్‌పై 200-210 పరుగులే చాలా ఎక్కువ. కానీ మేం చాలా క్యాచ్‌లు చేజార్చాం. పిచ్ బాగుంది. అక్కడక్కడా కొన్ని బంతులు ఆగుతూ వచ్చాయి. కానీ మేం చేసిన స్కోర్‌ను బట్టి మా బ్యాటర్లు బాగానే రాణించారు.

ఈ ఓటమిపై పెద్ద ఆందోళనలేమీ లేవు. కానీ మా ఫీల్డింగ్ చాలా మెరుగ్గా ఉండాల్సింది.
మేం ఫీల్డింగ్‌లో ఒక నిర్దిష్ట ప్రమాణాన్ని కలిగి ఉన్నాం. అలాంటిది 3 అత్యంత సులువైన క్యాచ్‌లను వదిలేశాక.. ఈ మ్యాచ్ గెలవడానికి అర్హులం కాదు. అయితే క్వాలిఫైయర్స్‌కు ముందే ఇలాంటి మ్యాచ్ ఎదురవడం ఒక రకంగా మాకు మంచిదే. రాబోయే రెండు రోజులు కాస్త విశ్రాంతి తీసుకుని అహ్మదాబాద్‌కు ప్రయాణం అవుతాం. అక్కడ పిచ్ ఎలా ఉందో చూసి, దానికి అనుగుణంగా తదుపరి మ్యాచ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం.'అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
కేకేఆర్ ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫిన్ అలెన్(35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 93) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. అంగ్‌క్రిష్ రఘు వంశీ(44 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82 నాటౌట్), కామెరూన్ గ్రీన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. అయితే ఈ ముగ్గురు బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను గుజరాత్ ప్లేయర్లు వదిలేసారు. ఫిన్ అలెన్ ఇచ్చిన రెండు క్యాచ్‌లు అందుకోలేకపోయారు.
అనంతరం గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులే చేసి ఓటమిపాలైంది. శుభ్‌మన్ గిల్(49 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 85), జోస్ బట్లర్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), సాయి సుదర్శన్(28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్(2/29) రెండు వికెట్లు తీయగా.. సౌరభ్ దూబే, కామెరూన్ గ్రీన్ చెరో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications