For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఒక్కడే మా ఓటమిని శాసించాడు: శుభ్‌మన్ గిల్

రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు, టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తమ ఓటమిని శాసించాడని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పవర్ ప్లేలోనే తమ విజయాన్ని లాక్కున్నాడని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) విధ్వంసకర శతకంతో రాజస్థాన్ రాయల్స్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. సూర్యవంశీ ధాటికి 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 25 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.

అందుకే ఫీల్డింగ్ చేయలేదు..
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. పవర్ ప్లేలోనే తమ ఓటమి ఖాయమైందని చెప్పాడు. 'రాజస్థాన్ ఓపెనర్లు పవర్ ప్లేలోనే మా విజయాన్ని లాగేసుకున్నారు. ఈ గెలుపు క్రెడిట్ వారి విధ్వంసకర బ్యాటింగ్‌కే దక్కుతుంది. మేం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. అయితే బయట కూర్చొని చాలా సలహాలు ఇవ్వవచ్చు. ఆరంభంలోనే మాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ మేం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. జట్టులో కొన్ని విషయాల్లో మేం ఇంకా మెరుగవ్వాలి.

Shubman Gill Says Vaibhav Suryavanshi hitting was just tremendous After RR beat GT in IPL 2025

వెన్ను నొప్పితోనే ఫీల్డింగ్ చేయలేదు. ఈ మ్యాచ్ తర్వాత మాకు వరుసగా మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో ఫిజియో రిస్క్ వద్దన్నాడు. విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. గెలిచినా.. ఓడినా మేం పెద్దగా పట్టించుకోం. ఓ మ్యాచ్ ముగిసిందనే భావిస్తాం. తదుపరి మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో ఉంది. అక్కడ మాకు మంచి రికార్డ్ ఉంది. కాబట్టి పుంజుకుంటామని ఆశిస్తున్నా. ఈ రోజు వైభవ్ సూర్యవంశీది. అతని హిట్టింగ్ అద్భుతం. తనకు కలిసొచ్చిన రోజును అతను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు.'అని శుభ్‌మన్ గిల్ కొనియాడాడు.

సూర్యవంశీ విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 209 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84), జోస్ బట్లర్(26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సాయి సుదర్శన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో మహీస్ తీక్షణ(2/35) రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగులు చేసి గెలుపొందింది. వైభవ్ సూర్యవంశీ సెంచరీకి తోడుగా యశస్వి జైస్వాల్(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. రియాన్ పరాగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) పర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, April 29, 2025, 7:24 [IST]
Other articles published on Apr 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+