Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాడికి ముందే చెప్పా సిక్స్ కొడతానని.. కోహ్లీ వల్లే ఈ పిచ్చి: శుభ్‌మన్ గిల్

అహ్మదాబాద్: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్లని గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఈ ఇద్దరి ఆటను చూసే క్రికెటర్ కావాలనుకున్నానని తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(58 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో చెలరేగాడు.

దాంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్‌మన్ గిల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో మ్యాచ్ అంటే తనకు పూనకాలు వస్తాయన్నాడు.

hubman Gill says Sachin Tendulkar and Virat Kohli

సన్‌రైజర్స్‌తోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన తాను.. ఇప్పుడు సెంచరీ కూడా అందుకున్నానని తెలిపాడు. భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'ప్రత్యర్థి బౌలర్లు, మ్యాచ్ కండిషన్స్‌పై ఆధారపడి ఉంటుంది. గత మ్యాచ్‌లో నేను దారుణంగా విఫలమయ్యాను. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం చాలా ముఖ్యం.

అభిషేక్ శర్మ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ ఎంతో సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే వాడికి ముందే చెప్పా. నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని. అన్నట్లుగానే సిక్స్ బాదాను.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ పంజాబ్‌కు ఓపెనర్లుగా ఆడుతారు. ఆ చనువుతోనే గిల్ ఈ కామెంట్స్ చేశాడు.

ఇక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్లని చెప్పిన గిల్.. వారి వల్లే క్రికెటర్ అయ్యానని తెలిపాడు. 'నాకు క్రికెట్ అర్ధమైనప్పటి నుంచి కోహ్లీ నా హీరో. ఆట పట్ల అతనికి ఉన్న పిచ్చి, అంకితభావం, ఎనర్జీ నన్ను చాలా ప్రోత్సహించాయి. ఆటపై ఎంతో మక్కువ చూపేలా చేసాయి.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. శుభ్‌మన్‌కు తోడుగా సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 47)రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, ఫరూఖీ, నటరాజన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులే చేసి ఓటమిపాలైంది. హెన్రిచ్ క్లాసెన్(44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో రాణించగా.. భువనేశ్వర్ కుమార్(26 బంతుల్లో 3 ఫోర్లతో 27) ఫర్వాలేదనిపించాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ నాలుగేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Tuesday, May 16, 2023, 9:42 [IST]
Other articles published on May 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+