Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: డిప్రెషన్‌లో శుభ్‌మన్ గిల్.. ఎందుకు?

మెడ నొప్పితో ఆసుపత్రిపాలైన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే. నిద్రలో మెడలు పట్టేసినా.. పెయిన్ కిల్లర్స్ సాయంతో బ్యాటింగ్‌కు దిగిన శుభ్‌మన్ గిల్ మూడే మూడు బంతులు ఆడి రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ మూడు బంతుల్లో గిల్ ఓ బౌండరీ బాదాడు.

అయితే ఈ బౌండరీ బాదే క్రమంలో అతని మెడ నరాలపై ఒత్తిడి పడి నొప్పి తీవ్రమైంది. దాంతో అతను మైదానం వీడాడు. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. సాయంత్రానికి నొప్పి తీవ్రం కావడంతో గిల్‌ను కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. నొప్పి తగ్గడంతో ఆదివారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశాడు.

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిద్రలేమి కారణంగానే శుభ్‌మన్ గిల్ మెడ కండరాలు పట్టేసాయని, త్వరలోనే కోలుకుంటాడని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అనేక సందేహాలకు ఊతమిస్తున్నాయి.

Shubman Gill s Neck Injury Sparks Fan Theories Involving Gautam Gambhir and Sara Tendulkar

26 ఏళ్ల శుభ్‌మన్ గిల్‌కు నిద్రలేమి సమస్య ఏంటని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టార్చర్‌ను శుభ్‌మన్ గిల్ తట్టుకోలేకపోతున్నాడా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులో భారత కెప్టెన్సీ బాధ్యతలు అందుకొని సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్.. ఇలా డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్లాడని, అభిమానుల అంచనాలను భారంగా భావిస్తున్నాడా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలోని వైఫల్యం అతన్ని వెంటాడిందా? లేక వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు.

ముఖ్యంగా తన గర్ల్‌ఫ్రెండ్ అంటూ ప్రచారం జరుగుతున్న సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ గిల్‌కు ఏమైనా విభేదాలు తలెత్తాయా? అని ఫ్యాన్స్ సందేహిస్తున్నారు. సారా టెండూల్కర్‌తో గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గత రెండేళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను గిల్ ఖండించినా.. ఈ పుకార్లు ఆగడం లేదు. ఈ ఇద్దరూ వ్యవహరి శైలి కూడా అలానే ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ఏది ఏమైనా కెప్టెన్సీ కెరీర్ ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్ ఇలా డిప్రెషన్‌‌కు లోనవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

Story first published: Monday, November 17, 2025, 12:24 [IST]
Other articles published on Nov 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+