For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓయ్ అంపైర్ నిద్రపోతున్నావా? అది ఎలా ఔట్.. శుభ్‌మన్ వికెట్‌పై ఫ్యాన్స్ ఫైర్!

Shubman Gill’s dismissal in warm-up match against Australia A raises doubts

సిడ్నీ: ఆస్ట్రేలియా-ఏతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటైన విధానం వివాదాస్పదమైంది. అసలు శుభ్‌మన్‌ను ఏ విధంగా ఔటిచ్చారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఫలితం తేలకుండా ముగిసిన ఈ పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే 65 పరుగులతో టచ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ అంపైర్ తప్పిదంతో వెనుదిరగడం అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో సదరు అంపైర్‌ తప్పిదాన్ని అభిమానులు సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే..?

భారత రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో దూకుడు మీదున్న శుభ్‌మన్‌ గిల్‌ను ఆసీస్‌ స్పీన్నర్ మిచెల్‌ స్వేప్సన్‌ సందేహాస్పద రీతీలో ఔట్‌ చేశాడు. స్వేప్సన్‌ వేసిన బంతి గిల్‌ ప్యాడ్లను తాకి స్లిప్‌లోకి వెళ్లింది.. స్లిప్‌లో ఉన్న సీన్‌ అబాట్‌ దాన్ని అద్భుత డైవ్‌తో అందుకున్నాడు. స్వేప్సన్‌ గట్టిగా అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ వెంటనే ఔట్‌ ఇచ్చాడు. అయితే అది ఏల్బీడబ్ల్యూనా? లేక క్యాచ్ ఔటా? అనే విషయం స్పష్టత లేదు. కానీ స్కోరుబోర్డులో మాత్రం గిల్‌ క్యాచ్‌ ఔట్‌ అయినట్లుగా పేర్కొన్నారు. ఇక అంపైర్ నిర్ణయంతో షాక్‌‌కు గురైన గిల్‌ అసలు ఔటా.. కాదా అన్న సందిగ్ధంతో కాసేపు అక్కడే నిలుచుండిపోయాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కావడంతో డీఆర్‌ఎస్‌ అవకాశం లేకపోవడంతో గిల్‌ నిరాశగా వెనుదిరగాడు.

టీవీ రీప్లేలో క్లారిటీ..

టీవీ రీప్లేలో క్లారిటీ..

వాస్తవానికి టీవీ రీప్లేలో స్వేప్సన్‌ వేసిన బంతి గిల్‌ ప్యాడ్లను తాకి ఆఫ్‌స్టంట్‌ పై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది.. దీంతో అతను ఎల్బీగా ఔటయ్యే చాన్స్ లేదు. ఇక బంతి బ్యాట్‌ను తాకకుండా కేవలం గిల్‌ ప్యాడ్లను మాత్రమే తాకి స్లిప్‌లో ఉన్న అబాట్‌ చేతుల్లో పడింది. అలా చూసినా గిల్‌ ఔట్‌ కాదని స్పష్టంగా తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

అంపైర్ చీటింగ్..

అంపైర్ చీటింగ్..

ఇది చీటింగ్‌ అసలు గిల్‌ ఔటే కాదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను చిన్న పిల్లోడికి చూపించిన చెబుతారని, అంపైర్ నిద్ర పోయినట్లున్నాడాని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా గిల్ ఎలా ఔటో అంపైర్ చెప్పాలని డిమాండ్ చేశాడు.'శుభ్‌మన్‌ ఎలా ఔటయ్యాడో అంపైర్‌ చెప్పాలి.. కచ్చితంగా ఎల్బీ మాత్రం కాదు.. క్యాచ్‌ అవుటా? అంటే ఆ అవకాశమే లేదు.'అంటూ చురకలంటించాడు.

ప్రాక్టీస్‌ ప్రతిఫలం భారత్‌దే..

ప్రాక్టీస్‌ ప్రతిఫలం భారత్‌దే..

ఈ ప్రాక్టీస్ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసినా.. బోలెడు లాభాలు ఒరిగింది మాత్రం కచ్చితంగా టీమిండియాకే. ఈ మ్యాచ్‌ జట్టు కూర్పునకు దోహదం చేసింది. లయతప్పిన పంత్‌ను ఫామ్‌లోకి తెచ్చింది. ఓపెనింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ చక్కని ప్రత్యామ్నాయం అనిపించింది. విహారిని అక్కరకొచ్చే పార్ట్‌టైమ్‌ బౌలర్‌ (స్పిన్‌)గా, మిడిలార్డర్‌లో దీటైన బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది. ఆఖరి రోజు సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ) పూర్తిగా బ్యాటింగ్‌ వికెట్‌గా మారింది. దీంతో భారత బౌలర్ల శ్రమంతా నీరుగారింది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ‘ఎ' జట్టులో బెన్‌ మెక్‌డెర్మట్‌ (107 నాటౌట్‌; 16 ఫోర్లు), జాక్‌ విల్డర్‌ముత్‌ (111 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకాలతో నిలబడ్డారు. మ్యాచ్‌ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ' రెండో ఇన్నింగ్స్‌లో 75 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేసింది.

Story first published: Monday, December 14, 2020, 11:01 [IST]
Other articles published on Dec 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+