IND vs AFG: అందుకే కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టాం: శుభ్‌మన్ గిల్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు.
ప్రయోగాలు చేస్తాం..
ఇక వాతావరణ పరిస్థితులతోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. వాతావరణం కొద్దిగా మేఘావృతమై ఉంది. కాబట్టి బౌలర్లకు కొంతవరకు సహకారం లభించవచ్చు. పిచ్ చూడటానికి బాగుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్‌లా కనిపిస్తోంది. అయితే ప్రారంభంలో పేసర్లకు కాస్త స్వింగ్ లభించే అవకాశం ఉంది.

రాబోయే వరల్డ్ కప్‌కు ముందు మేం దాదాపు 15-20 వన్డేలు ఆడబోతున్నాం. మాకు ఏ కాంబినేషన్ సరిగ్గా సరిపోతుందో చూసేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం స్తున్నారు. గుర్నూర్ బ్రార్, హర్ష్‌దూబే కెరీర్‌లో తమ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా యశస్వి జైస్వాల్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లకు ఈ మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టి గుర్నూర్ బ్రార్‌కు అవకాశం కల్పించారు.
బౌలింగ్ ఎంచుకునేవాళ్లం..
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అన్నాడు. 'టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ, టాస్ మన చేతుల్లో ఉండదు కదా.. మ్యాచ్ ప్రారంభం నుంచే మేం మంచి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. గత కొద్దికాలంగా మేం చాలా బాగా రాణిస్తున్నాం. అయితే భారత్‌ను వారి సొంత గడ్డపై ఎదుర్కోవడం మాకు ఇదే తొలిసారి.
కాబట్టి ఇది ఇరు జట్లకు గట్టి పోటీనిచ్చే పోరు అవుతుంది. మేం ఈ సవాలుకు సిద్ధంగా ఉన్నాం. ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఇక్కడ బాగా రాణిస్తామని ఆశిస్తున్నాం. మేం ముగ్గురు సీమర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. ' హష్మతుల్లా షాహిదీ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
అఫ్ఘనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ గజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

