Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: అందుకే కుల్దీప్ యాదవ్‌‌ను తీసుకోలేదు: శుభ్‌మన్ గిల్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ శుభ్‌మన్ గిల్ టాస్ గెలవలేదు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. మరోవైపు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. టాస్ గెలవడం సంతోషం. ఇక్కడ ఆడేందుకు ఎవరైనా ఇష్టపడుతారు. ఈ మైదానం ఎప్పుడూ ప్రేక్షకులతో కిక్కిరిసిపోతుంది. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. ఫిలిప్పి స్థానంలో అలెక్స్ క్యారీ, ఎల్లిస్ స్థానంలో గ్జేవియర్ బార్ట్‌లెట్‌ బరిలోకి దిగుతున్నారు.'అని మిచెల్ మార్ష్ చెప్పుకొచ్చాడు.

Shubman Gill Reveals Why Kuldeep Yadav Is Not Playing in 2nd ODI vs Australia in Adelaide
Photo Credit: BCCI(X)

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ ఎంచుకునేవాళ్లమని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ముందుగా బ్యాటింగ్ చేయడం సంతోషమే. వర్షం మధ్య ఆడటం అంత సులువు కాదు. ఈ రోజు అంతరాయం కలగించదని ఆశిస్తున్నా. తుది జట్టులో ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.

టీమ్ కాంబినేషన్‌ను మార్చవద్దనే కుల్దీప్ యాదవ్‌ను ఆడించడం లేదనే విషయాన్ని గిల్ పరోక్షంగా వెల్లడించాడు. తొలి వన్డే పరాజయం అనంతరం కుల్దీప్ యాదవ్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచించినా గంభీర్, గిల్ పట్టించుకోలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌లో నిలవనుంది. లేదంటే సిరీస్ ఆసీస్ కైవసం కానుంది.

తుది జట్లు:

భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మ్యాట్ రేన్‌షా, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోల్లీ, మిచెల్ ఓవెన్, గ్జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్.

Story first published: Thursday, October 23, 2025, 8:48 [IST]
Other articles published on Oct 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+