Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ZIM: అందుకే రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనపెట్టాం: శుభ్‌మన్ గిల్

టీమిండియాతో జరుగుతున్న ఐదో టీ20లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని జింబాబ్వే సారథి సికందర్ రాజా అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారనుంది.

మా జట్టులో ఎలాంటి సమస్య లేదు. ఈ మ్యాచ్ గెలవాల్సిన ఉత్సాహం, నైపుణ్యం మాకు ఉంది. మేం అద్భుత ప్రద్శనతో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ముగించాలనుకుంటున్నాం. మా జట్టులో ఒక మార్పు చేశాం. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఆడిన చతరాకు రెస్ట్ ఇచ్చి.. బ్రాండన్ మవుతాను తీసుకున్నాం.'అని సికందర్ రాజా చెప్పుకొచ్చాడు.

Shubman Gill reveals the reason why Ruturaj Gaikwad not playing in India vs Zimbabwe 5th T20I

టాస్ గెలిచినా తాము బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తే.. ఫాస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా పరుగులివ్వకుండా బౌలింగ్ చేస్తున్నారు. ఆటగాళ్లంతా సత్తా చాటేందుకు చాలా ఆకలితో ఉన్నారు. వరుసగా మ్యాచ్‌లు ఆడటం అంత సులువైన పనికాదు.

జట్టులో కొన్ని మార్పులు చేశాం. ముఖేష్ కుమార్, రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చారు. రియాన్ పరాగ్‌కు అవకాశం ఇవ్వడం కోసం రుతురాజ్ గైక్వాడ్‌, ముఖేష్ కుమార్ కోసం ఖలీల్ అహ్మద్‌లను పక్కనపెట్టాల్సి వచ్చింది.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

భారత్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్

జింబాబ్వే: వెస్లీ మధేవెరె, టడివాన్షే మరుమని, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైర్స్

Story first published: Sunday, July 14, 2024, 16:38 [IST]
Other articles published on Jul 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+