ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.
మూడో టెస్ట్ అనంతరం తగిన విశ్రాంతి లభించింది. మా ఆటగాళ్లంతా అందరూ ఇంటికి వెళ్లి రీఛార్జ్ అయ్యారు. లార్డ్స్‌లో ప్రతీ ఆటగాడు తమ శక్తిని ధారపోసారు. గత మూడు మ్యాచ్‌లు ఆఖరి సెషన్ వరకు జరిగాయి. ఇది ఇరు జట్ల నాణ్యతను తెలియజేస్తున్నాయి. ఇది మాంచెస్టర్ తరహా వికెట్. చాలా హార్డ్‌గా ఉండటంతో పాటు గ్రాస్ కూడా ఉంది. డాసన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.'అని బెన్ స్టోక్స్ తెలిపాడు.

మరోవైపు టాస్ ఓడిపోవడమే మంచిదైందని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. టాస్ గెలిస్తే బౌలింగ్, బ్యాటింగ్ ఎంచుకునే విషయంలో తాను కాస్త గందరగోళానికి గురయ్యానని తెలిపాడు. 'గత మూడు మ్యాచ్‌ల్లో మేం మెరుగైన ప్రదర్శన చేశాం. తృటిలో విజయాన్ని చేజార్చుకున్నాం. కానీ ప్రత్యర్థి కంటే ఎక్కువ సెషన్లలో ఆధిపత్యం చెలాయించాం. మూడు టెస్ట్‌లు హోరాహోరీగా సాగాయి. ఇది కూడా మంచి పిచ్‌లా కనిపిస్తోంది. హార్డ్‌గా ఉంది. రాబోయే నాలుగు-ఐదు రోజులు వర్షం పడే అవకాశం కూడా ఉంది.
జట్టులో మూడు మార్పులు చేశాం. కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు. గాయపడిన ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి స్థానాల్లో అన్షూల్ కంబోజ్, శార్డూల్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నారు.'అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. తప్పని పరిస్థితుల్లోనే కరుణ్ నాయర్‌ను తుది జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని గిల్ తెలిపాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో నిలవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్