Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్దరి వల్లే ఇంగ్లండ్ పర్యటనలో రాణించా: శుభ్‌మన్ గిల్

ఇంగ్లండ్ పర్యటనలో తాను మెరుగ్గా రాణించడానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సలహాలు ఉపయోగపడ్డాయని టీమిండియాటెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఈ ఇద్దరి నుంచి సలహాలు తీసుకున్నట్లు జియోహాట్‌స్టార్ ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. ఇంగ్లండ్‌ పర్యటనతోనే టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు చేపట్టిన శుభ్‌మన్ గిల్.. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా దుమ్మురేపాడు.

ఐదు టెస్ట్‌ల్లో 75.40 సగటుతో 754 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శతకాలు ఉన్నాయి. విదేశీ పిచ్‌లపై గిల్ రాణించలేడనే విమర్శలకు తన బ్యాట్‌తోనే గిల్ సమాధానమిచ్చాడు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌తో మాట్లాడిన గిల్.. తన సక్సెస్ సీక్రెట్‌ను వెల్లడించాడు.

Shubman Gill Reveals Sachin Smith Advice Behind His Success in England

సచిన్, స్మిత్‌తో మాట్లాడాను..

'విదేశాల్లో రాణించలేదనే ఒత్తిడి నాపై ఉండేది. కానీ నా ప్రాక్టీస్, మనస్థత్వం, బ్యాటింగ్ చేస్తున్న స్థానాలపై నాకు చాలా నమ్మకం ఉంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు నేను సచిన్ సార్‌తో మాట్లాడాను. అలాగే ఐపీఎల్‌లో నాతో కలిసి ఆడిన మాథ్యూ వేడ్ ద్వారా స్టీవ్ స్మిత్ నెంబర్ తీసుకొని మాట్లాడాను. ఇద్దరూ ఒకే విషయం చెప్పారు. స్ట్రెయిట్‌గా డిఫెండ్ చేయాలి, స్క్వేర్ దిశగా పరుగులు చేయాలని సూచించారు.

ముందుగా సచిన్‌తో మాట్లాడాలంటే చాలా ఆలోచించా. కానీ ఆయనతో సంభాషించాక అద్భుతమైన అనుభూతి కలిగింది. నా బ్యాటింగ్ విషయంలో ఆయన చాలా సూచనలు ఇచ్చాడు. మిడాఫ్ ఆడేటప్పుడు బంతిని స్టంప్స్‌ పైకి రానివ్వకుండా చూడాలన్నాడు. ఆ బంతులను స్క్వేర్ లెగ్ వైపు ఆడాలని సూచించాడు. నా బ్యాటింగ్‌ టెక్నిక్‌లోని లోపాలు చెప్పాడు. వాటిపై నెట్స్‌లో తీవ్రంగా ఫోకస్ పెట్టా. విపరీతంగా ప్రాక్టీస్ చేశా.

మానసిక బలం ముఖ్యం..

మానసికంగా బలంగా ఉండాలని స్మిత్ సూచించాడు. ఇంగ్లండ్ పేసర్లను ఎదుర్కొనేటప్పుడు చాలా కీలకమని తెలిపాడు. టెస్ట్‌ల్లో చాలా ఓపికగా ఉండాలని, డ్రైవ్‌ల కోసం ప్రయత్నించకూడదని చెప్పాడు. తొలి గంటలో షాట్స్ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఆడాలని తెలిపాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 2, 2025, 16:42 [IST]
Other articles published on Oct 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+