Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సారా అలీఖాన్ కాదు.. ఆ సౌతిండియా హీరోయిన్‌పై మనసు పారేసుకున్న శుభ్‌మన్ గిల్!

Shubman Gill Reveals Rashmika Mandhana As His Crush

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తనకు ఇష్టమైన సెలబ్రిటీ ఎవరో చెప్పాడు. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్ చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్‌ మారింది. బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ పేరు చెప్పకుండా.. సౌతిండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మంధన్న అంటే తనకు చాలా ఇష్టమని గిల్ పేర్కొన్నాడు.

దాంతో ఫ్యాన్స్ రష్మిక, గిల్ ఫొటోలతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, రష్మిక పేర్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. టాలీవుడ్ టాప్ హీరో విజయ్ దేవరకొండ లవర్‌పైనే శుభ్‌మన్ గిల్ మనసు పారేసుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

రష్మిక పేరు చెప్పి..

రష్మిక పేరు చెప్పి..

ఓ చానెల్‌తో మాట్లాడిన శుభ్‌మన్ గిల్‌ను ఇష్టమైన నటి ఎవరు? అని అడగ్గా.. ముందుగా సమాధానం ధాటవేయడానికి ప్రయత్నించాడు. కానీ హోస్ట్ పట్టుబట్టడంతో ఓపెన్ అయ్యాడు. తనకు రష్మిక మంధన్న అంటే ఇష్టమని స్పష్టం చేశాడు. ఇక రష్మిక రియాక్షన్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్‌తో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం నడుపుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఫాలో అవ్వడంతో పాటు ఒకే తరహా పోస్ట్‌లు పెట్టడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే కొద్ది రోజులకు ఈ ఇద్దరూ విడిపోయారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

సారా అలీ ఖాన్‌తో ప్రేమాయణం..

సారా అలీ ఖాన్‌తో ప్రేమాయణం..

ఆ తర్వాత శుభ్‌మన్ గిల్.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ రూమర్లను నిజం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి కాఫీ షాపులకు వెళ్లడం, డిన్నర్లు చేయడం వంటి పనులు మీడియాకు చిక్కడంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ నిజమేననే ప్రచారం ఊపందుకుంది.

ఈ క్రమంలోనే శుభ్‌మన్ గిల్ తన క్రష్ రష్మిక మంధన్న అని తెలపడం మరో చర్చకు దారి తీసింది. అయితే సారా అలిఖాన్‌తో ఉన్న ప్రేమయాణాన్ని సైడ్ ట్రాక్ ఎక్కించడానికే గిల్.. ఇలా రష్మిక పేరు చెప్పాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండతో..

విజయ్ దేవరకొండతో..

కన్నడ సినిమా కిరాక్ పార్టీ‌తో నటిగా అరంగేట్రం చేసిన రష్మిక.. తెలుగు సినిమాలతో పాపులర్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. గీతా గోవిందంతో పాటు పుష్ఫ సినిమా ఆమెను స్టార్ చేసింది. ఇక పుష్ప సినిమాలోని శ్రీవల్లి క్యారెక్టర్ ఆమెను ప్యాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. బాలీవుడ్‌లో పలు సినిమాలు నటించినా సక్సెస్ కాలేకపోయింది.

ఇక రష్మిక మంధన్న.. విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్లు ఉన్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తొలి రెండు టెస్ట్‌లకు బెంచ్‌కే పరిమితమైన గిల్.. మూడో టెస్ట్‌లో బరిలోకి దిగినా ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. అహ్మదాబాద్ టెస్ట్ కోసం సిద్దమవుతున్నాడు.

Story first published: Monday, March 6, 2023, 17:39 [IST]
Other articles published on Mar 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+