
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయంతో యూఏఈ వేదికగా జరగనున్న సెకండాఫ్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత జట్టుతో యూకే పర్యటనకు వెళ్లిన శుభ్‌మన్.. ఎడమ పిక్క కండరాల గాయంతో అర్థంతరంగా తప్పుకున్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో బరిలోకి దిగినప్పటికీ శుభ్‌మన్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ మెగా మ్యాచ్ సందర్భంగానే గాయపడ్డ అతను.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభానికి ముందే వెనుదిరిగాల్సి వచ్చింది. అతని గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, కోలుకోవడానికి సుమారు 3-6 నెలల సమయం పట్టవచ్చని బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. 'శుభ్‌మన్ గిల్ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

అతను కోలుకోవడానికి సుమారు మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టవచ్చు. ఈ క్రమంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గత నెల చివర్లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మకు మరో ఇద్దరు ఓపెనర్లను ఇంగ్లండ్ పంపించాలని కోరుతూ మెయిల్ చేశాడు.'అని సదరు అధికారి తెలిపాడు. దాంతో మరో రెండున్నర నెలల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లకు శుభమన్ గిల్ అందుబాటులో ఉండటంపై సందేహాలు నెలకొన్నాయి. అదే జరిగితే కోల్‌కతాకు ఇది కోలుకోలేని దెబ్బ. ఇప్పటికే ఆ జట్టు నిలకడలేమని ఆటతో సతమతమవుతోంది. అంతేకాకుండా సెకండాఫ్ మ్యాచ్‌లకు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
తీరికలేని ఒత్తిడి కారణంగానే తాను ఐపీఎల్ 2021 సెకండాఫ్‌కు దూరంగా ఉండాలనుకున్నట్లు కమిన్స్ ప్రకటించగా.. ఇంటర్నేషన్ బిజీ క్రికెట్ కారణంగా మోర్గాన్ దూరం కానున్నాడు. ఈ ఇద్దరికి తోడు శుభ్‌మన్ గాయపడటం ఆ జట్టను పీకల్లోతు కష్టాలో పడేసింది. ప్రస్తుతానికైతే శుభ్‌మన్ గాయంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపిన కేకేఆర్ మేనేజ్‌మెంట్.. వేచి చూసే ధోరణీలో ఉన్నట్లు తెలుస్తోంది. గిల్ సేవలను కోల్పోతే ఎవరీతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే ప్రశ్న కూడా కేకేఆర్‌ను ఇబ్బంది పెడుతోంది. ఐపీఎల్ 2021లో 7 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. రెండింటిలో మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో ఉంది. ఇక సెకండాఫ్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.