For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Player Of Month రేసులో శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్!

 Shubman Gill, Mohammed Siraj and Devon Conway Nominated For ICC Player Of The Month Award

హైదరాబాద్: వరుస సెంచరీలతో జోరు మీదున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మరో అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు. ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో నిలిచాడు. జనవరి నెలకు గానూ ఈ అవార్డు రేసులో నిలిచిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్ విభాగంలో భారత్ నుంచి ఇద్దరు పోటీ పడుతుండగా.. న్యూజిలాండ్ నుంచి మరొకరు నామినేట్ అయ్యారు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్, న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే.. శుభ్‌మన్ గిల్‌కు పోటీగా నిలిచారు.

3 సెంచరీలు.. ఓ డబుల్ సెంచరీ..

3 సెంచరీలు.. ఓ డబుల్ సెంచరీ..

జనవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ఐసీసీ ఈ ముగ్గురిని ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ చేసింది. ఈ ఏడాది ఆరంభం నుంచే గిల్ దుమ్మురేపుతున్నాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో 70, 21, 116 పరుగులతో గిల్ రాణించాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విధ్వంసకర డబుల్ సెంచరీ బాది తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు. ఈ మ్యాచ్‌లో 149 బంతుల్లోనే 208 రన్స్ చేశాడు. అదే సిరీస్‌లో తర్వాతి రెండు వన్డేల్లో 40, 112 స్కోర్లు చేశాడు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ రెచ్చిపోయాడు. టి20 ఫార్మాట్‌కు పనికి రాడన్న విమర్శలకు చెక్ పెడుతూ చివరి మ్యాచ్ లో మెరుపు సెంచరీ సాధించి ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

14 వికెట్లు..

14 వికెట్లు..

మరోవైపు హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ కూడా సత్తా చాటాడు. జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో అసాధారణ ప్రదర్శన కనబరుస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వన్డేల్లో ఇప్పటికే నంబర్ వన్ ర్యాంకు కూడా అందుకున్నాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో అతను మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు తీసుకున్నాడు. రెండో వన్డేలో ఆరు ఓవర్లు వేసి కేవలం 10 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

ఫస్ట్ సెంచరీ కాన్వేదే..

ఫస్ట్ సెంచరీ కాన్వేదే..

న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే సైతం జనవరిలో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ ఏడాది సెంచరీ అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన కాన్వే.. భారత్‌తో వన్డే సిరీస్‌లో ఓ సెంచరీ నమోదు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి జనవరిలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అభిమానులు, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. 99 శాతం ఈ అవార్డు శుభ్‌మన్ గిల్‌నే వరించనుంది.

Story first published: Tuesday, February 7, 2023, 20:32 [IST]
Other articles published on Feb 7, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+