Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: శుభ్‌మన్ గిల్ ఘోర తప్పిదం.. అర్ష్‌దీప్ సింగ్ అసహనం!

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన ఘోర తప్పిదంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా రివ్యూ తీసుకోకుండా ఘోర తప్పిదం చేసింది. దాంతో అఫ్గానిస్థాన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియా రివ్యూ తీసుకొని ఉంటే రెహ్మానుల్లా గుర్బాజ్ 14 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగేవాడు.

IND vs AFG: అందుకే కుల్దీప్ యాదవ్‌‌ను పక్కనపెట్టాం: శుభ్‌మన్ గిల్

IND vs AFG: అందుకే కుల్దీప్ యాదవ్‌‌ను పక్కనపెట్టాం: శుభ్‌మన్ గిల్

అర్ష్‌దీప్ సింగ్ వేసిన 3వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని అర్ష్‌దీప్ సింగ్ గుడ్ లెంగ్త్ డెలివరీ వేయగా.. గుర్బాజ్ షాట్ ఆడటంలో తడబడ్డాడు. దాంతో బంతి ప్యాడ్స్‌కు తాకింది. భారత ఆటగాళ్లు ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేయగా.. అంపైర్ స్పందించలేదు. బ్యాట్‌కు సమీపంగా వెళ్లడంతో ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుందని భారత ఆటగాళ్లు పొరబడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్‌సైడ్ ఎడ్జ్ అయ్యిందంటూ సైగలు చేశాడు.

Shubman Gill Missed DRS Review Grants Century Hero Rahmanullah Gurbaz a Lifeline IND vs AFG 1st ODI
Photo Credit: X (twitter)

ముఖ్యంగా స్లిప్ కార్డన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ కూడా ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుందని రివ్యూ తీసుకోవద్దని సూచించాడు. కానీ రిప్లేలో ఇన్‌సైడ్ ఎడ్జ్ కాలేదని తేలింది. అంతేకాకుండా ఔట్ అని స్పష్టమైంది. దాంతో అర్ష్‌దీప్ సింగ్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర నిల్చొని చేతులు పైకెత్తి అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌటయ్యే ప్రమాదం నుంచి కూడా గుర్బాజ్ తప్పించుకున్నాడు. ఈ అవకాశాలతో గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గుర్బాజ్.. 48 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు.

వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన అఫ్గాన్ బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. సెంచరీ అనంతరం రెహ్మానుల్లా గుర్బాజ్(51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లతో 102)ను నితీష్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేసి నాలుగో వికెట్‌కు నమోదైన 116 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

10 శాతం కమీషన్ దొబ్బుతూనే ఐపీఎల్‌పై విమర్శలా?: సునీల్ గవాస్కర్ ఫైర్!

10 శాతం కమీషన్ దొబ్బుతూనే ఐపీఎల్‌పై విమర్శలా?: సునీల్ గవాస్కర్ ఫైర్!

వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో ఈ మ్యాచ్‌ను అంపైర్లు 25 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. అఫ్గాన్ బ్యాటింగ్‌కు దిగింది.

Story first published: Saturday, June 13, 2026, 19:31 [IST]
Other articles published on Jun 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+