Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్, విరాట్ రిటైర్మెంట్‌పై శుభ్‌మన్ గిల్ బిగ్ స్టేట్‌మెంట్!

వెస్టిండీస్ జట్టుతో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి వన్డేలో ఓటమి ఎదురైనప్పటికీ.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా సిరీస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయం కంటే కూడా సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తు, 2027 వన్డే ప్రపంచ కప్‌లో వారి ప్రాతినిధ్యంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ధోనీ బాటలో గిల్: కెప్టెన్ తీసుకున్న ఆ నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది! (వీడియో)

ధోనీ బాటలో గిల్: కెప్టెన్ తీసుకున్న ఆ నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది! (వీడియో)

వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన అనంతరం శుభ్‌మన్ గిల్ మీడియా సమావేశంలో మాట్లాడితూ.. సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ ఊహాగానాలకు స్వస్తి పలికారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు 2027 ప్రపంచ కప్ ప్రణాళికలు రూపుదిద్దుకోలేవని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరూ జట్టు వ్యూహాల్లో కీలక భాగమని, స్టేడియంలో వారి అనుభవం, నిలకడైన ప్రదర్శన టీమిండియాకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. జట్టుకు అవసరమైన ప్రతిసారీ వారు అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఆదుకుంటున్నారని శుభ్‌మన్ గిల్ ప్రశంసించారు.

Shubman Gill Makes Huge Statement Says Rohit Sharma and Virat Kohli in 2027 World Cup Full Details

ఈ సందర్భంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రస్తుత ఫామ్‌ను శుభ్‌మన్ గిల్ కొనియాడారు. "రోహిత్ భాయ్ గత నాలుగు ఇన్నింగ్స్‌లుగా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే విరాట్ భాయ్ కూడా మైదానంలో తన అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వీరికి తోడు కేఎల్ రాహుల్ కూడా లభించిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకుంటూ జట్టుకు గొప్ప సహకారాన్ని అందిస్తున్నాడు" అని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించారు. కాగా ఈ సిరీస్‌లోనే విరాట్ కోహ్లీ తన కెరీర్లో 55వ వన్డే సెంచరీని సాధించడం విశేషం.

ఆ తప్పులే కొంపముంచాయి: శుభ్‌మన్ గిల్

Also Read

ఆ తప్పులే కొంపముంచాయి: శుభ్‌మన్ గిల్

యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడానికి సీనియర్లకు విశ్రాంతి నిచ్చే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా.. ప్రయోగాలకు ఇక సమయం లేదని శుభ్‌మన్ గిల్ తేల్చి చెప్పారు. ప్రపంచ కప్‌కు తగినంత సమయం ఉన్నప్పటికీ.. ముందే తుది కోర్ టీమ్‌ను ఖరారు చేసుకుని ఆటగాళ్లు కలిసి ఆడితేనే మెరుగైన సమన్వయం సాధ్యమవుతుందన్నారు. 39 ఏళ్ల రోహిత్ శర్మ, 37 ఏళ్ల విరాట్ కోహ్లీల వయస్సుపై వస్తున్న విమర్శలకు వారి బ్యాటింగ్ ప్రదర్శనే సరైన సమాధానమని శుభ్‌మన్ గిల్ వ్యాఖ్యానించారు. శుభ్‌మన్ గిల్ చేసిన ఈ కామెంట్లతో 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఈ దిగ్గజాలు నీలిరంగు జెర్సీలో అలరించడం ఖాయమని తేలిపోయింది.

Story first published: Sunday, October 4, 2026, 17:43 [IST]
Other articles published on Oct 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+