For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ తప్పిదంతోనే గెలవలేకపోయాం: శుభ్‌మన్ గిల్

తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేయలేకపోవడంతోనే విజయం సాధించలేకపోయామని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. సెట్ అయిన బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేకపోయారని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాణించకపోయినా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఓటమిని తప్పించుకున్నామని సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా ఆదివారం ముగిసిన నాలుగో టెస్ట్‌ను టీమిండియా డ్రా చేసుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాల అసాధారణ బ్యాటింగ్‌తో ఓటమిని తప్పించుకుంది.

ఒత్తిడిలో సూపర్ బ్యాటింగ్..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్ తమ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. తీవ్ర ఒత్తిడిలో తమ బ్యాటర్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. 'మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా మాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. వికెట్లు పడితే సమీకరణం మారే పరిస్థితి నెలకొంది. ఐదో రోజు వికెట్‌పై ఏం జరుగుతుందో? అనే ఆందోళన నెలకొంది. ప్రతీ బంతి కీలకంగా మారింది. మేం ప్రతీ బంతిని ఆడుతూ.. ఆటను చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాం. జట్టు సమావేశంలో అదే మాట్లాడుకున్నాం.

Shubman Gill Laments India s Missed Opportunities Not Able to Convert Starts Into Big Ones in Drawn 4th Test

అందుకే డ్రాకు అంగీకరించలేదు..

రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్‌తో సెంచరీలకు చేరువయ్యారు. వారి పోరాటానికి గుర్తింపుగా శతకాలు పూర్తి చేసుకోవాలని భావించాం. ఈ క్రమంలోనే ముందుగా డ్రాకు అంగీకరించలేదు. ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ఆఖరి సెషన్ వరకు జరుగుతుంది. చాలా నేర్చుకున్నాం. ఒక జట్టుగా ఈ సిరీస్ మాకు ఎన్నో విషయాలను తెలియజేసింది. తదుపరి మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేయాలనుకుంటున్నాం. నిజాయితీగా చెప్పాలంటే గతంలో ఎన్ని పరుగులు చేశారనేది ముఖ్యం కాదు. వైట్ జెర్సీ ధరించి దేశం తరఫున బరిలోకి దిగిన ప్రతీ సారి కొంత కంగారు ఉంటుంది.

ఆ ఒక్క తప్పిదం..

అది దేశం కోసం ఆడటం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. నేను బ్యాటింగ్‌ చేసే ప్రతీ సారి మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటా. నా బ్యాటింగ్‌ను వీలైనంత మేరకు ఆస్వాదించాలనుకుంటాను. తొలి ఇన్నింగ్స్‌లో మేం మెరుగైన స్కోర్ చేశాం. కానీ మా బ్యాటర్లలో చాలా సెట్ అయిన తర్వాత ఔటయ్యారు. ఈ తరహా వికెట్లపై సెట్ అయిన బ్యాటర్లు భారీ స్కోర్లు చేయడం ముఖ్యం. దురదృష్టవశాత్తు అది జరగలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆ తప్పిదాన్ని సరిదిద్దుకున్నాం. బుమ్రా ఫిట్‌నెస్ గురించి వేచి చూడాలి. మేం మ్యాచ్ గెలుస్తున్నంత కాలం టాస్ గురించి పట్టించుకోం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)

భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్‌మన్ గిల్ 103, జడేజా 107*, సుందర్ 101*, క్రిస్ వోక్స్ 2/67)

Story first published: Sunday, July 27, 2025, 23:09 [IST]
Other articles published on Jul 27, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+