Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నేను అప్పుడే టాస్ గెలుస్తానేమో: శుభ్‌మన్ గిల్

రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లోనూ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. వరుసగా 8 టెస్ట్‌ల్లో టాస్ ఓడిపోవడంపై శుభ్‌మన్ గిల్ సరదాగా స్పందించాడు. తాను గెలిచే ఏకైక టాస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లోనే అవుతుందేమోనని అన్నాడు. టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. మా కుర్రాళ్లు ఇటీవలే పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చారు. నేను ఏ జట్టుతో ఇక్కడ ఆడాను. ఈ సిరీస్ కోసం మేం బాగానే సన్నదమయ్యాం. ఈ మ్యాచ్ చూసేందుకు 50-60 వేల మంది రావడం కనువిందుగా ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నా. మా టైటిల్‌ నిలబెట్టుకున్నేందుకు ప్రయత్నిస్తాం. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. ప్రదర్శన పరంగా మా జట్టుకు తిరుగులేదు. పిచ్ పొడిగా కనిపిస్తుంది. గడ్డి ఎక్కువగా లేదు. ఇది విభిన్నమైన భారతీయ వికెట్. తొలి ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడం ముఖ్యం. పక్కటెముక గాయం కారణంగా రబడా ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో కార్బిన్ బోష్ ఆడుతున్నాడు.'అని టెంబా బవుమా చెప్పుకొచ్చాడు.

Shubman Gill Jokes He ll Win His Next Toss Only in the WTC Final

మరోవైపు మ్యాచ్ ఆరంభంలో స్వింగ్ లభిస్తుందని, దాన్ని క్యాష్ చేసుకుంటామని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'నేను గెలవబోయే ఏకైక టాస్ డబ్ల్యూటీసీ ఫైనల్లోనే అనుకుంటా. ఈ పిచ్ చూడటానికి బాగా కనిపిస్తోంది. ఆరంభంలో కొంత స్వింగ్ లభిస్తుందని ఆశిస్తున్నా. దానిని ఉపయోగించుకోగలుగుతామని ఆశిస్తున్నా. డ్రెస్సింగ్ రూమ్ అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్‌ కోసం మా ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేం ఆడిన ప్రతీ మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తాం. ఈ రెండు మ్యాచ్‌లు చాలా కీలకమైనవి. ఈ పిచ్ తొలి రెండు రోజులు సమతూకంగా ఉంటుంది. ఆ తర్వాత మ్యాచ్ సాగుతున్న కొద్దీ కొంత టర్న్ లభిస్తుంది. మా చివరిసారి ఆడిన టెస్ట్ మ్యాచ్ జట్టులో రెండు మార్పులు చేశాడు. నితీష్ రెడ్డి స్థానంలో రిషభ్ పంత్ రాగా.. అక్షర్ పటేల్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

తుది జట్లు:

సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్‌రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డిజోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సిమోన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్

భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభమాన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

Story first published: Friday, November 14, 2025, 10:19 [IST]
Other articles published on Nov 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+