Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sara Tendulkar: సచిన్ కూతురితో శుభ్‌మన్ గిల్ బ్రేకప్.. మరో హీరోయిన్‌తో డేటింగ్?

టీమిండియా స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇటీవలే 25వ జన్మదినం జరుపుకున్నాడు. బెంగళూరు వేదికగా తన సహచర ఆటగాళ్ల మధ్య ఈ బర్త్‌డే వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో టీమిండియా స్టార్స్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తదితర ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.

అయితే ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ .. సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త చర్చకు తెరలేపాయి. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ పలు పార్టీల్లో కనిపించడం, సన్నిహితంగా ఉండటం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అంతేకాకుండా శుభ్‌మన్ గిల్ సోదరితో కలిసి సారా టెండూల్కర్ లేట్ నైట్ పార్టీలకు హాజరవ్వడం కూడా ఈ ప్రచారానికి కారణమైంది.

Shubman Gill Is Dating Avneet Kaur After Breakup With Sara Tendulkar

అయితే ఈ వార్తలపై అటు సచిన్ కుటుంబం కానీ, ఇటు శుభ్‌మన్ గిల్ ఫ్యామీలీ కానీ స్పందించలేదు. ఖండించలేదు. శుభ్‌మన్ గిల్ కెరీర్‌పై సచిన్ ఆసక్తి కనబర్చడం, అతనికి వైస్ కెప్టెన్సీ దక్కడం వంటివి కూడా సారా టెండూల్కర్‌తో ప్రేమాయణం నిజమని నమ్మేలా చేశాయి. అయితే శుభ్‌మన్ గిల్ 25వ జన్మదినం సందర్భంగా సారా టెండూల్కర్ విషెస్ చేయకపోవడం, అతని బర్త్ డే పార్టీకి హాజరు కాకపోవడంతో వారు విడిపోయారనే ప్రచారం జరుగుతోంది.

ఇద్దరి మధ్య గొడవ జరిగి బ్రేకప్ చెప్పుకున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు శుభ్‌మన్ గిల్ మరో హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవనీత్ కౌర్‌తో శుభ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతుంది. శుభ్‌మన్ గిల్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ అవనీత్ కౌర్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన ఫొటోలో ఇద్దరూ కలిసి కనిపించారు.

అంతకుముందు 2023 సంవత్సరంలో వీరిద్దరూ కలిసి లండన్‌లో తిరిగిన ఫోటోలు కూడా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్.. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, September 10, 2024, 21:56 [IST]
Other articles published on Sep 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+