టీమిండియా కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్న శుభ్‌మన్ గిల్.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంప్రదాయాన్ని కొనసాగించాడు. సిరీస్ ట్రోఫీని అందుకొని కొత్తగా జట్టులోకి వచ్చిన యువ ప్లేయర్ నారయణ్ జగదీషన్‌కు అందించాడు. న్యూఢిల్లీ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం.
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్న శుభ్‌మన్ గిల్.. ధోనీ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ యువ ప్లేయర్ నారయణ్ జగదీషన్ చేతిలో పెట్టాడు. రవీంద్ర జడేజా అతని చేతుల్లో నుంచి లాక్కొని కాస్త ఆట పట్టించగా.. ఆ తర్వాత తిరిగి ఇచ్చేసాడు. అనంతరం జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అంతా కలిని ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు.

శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ప్రత్యేకంగా ట్రోఫీతో ఫోటోలు దిగగా.. గౌతమ్ గంభీర్‌తో కలిసి కుల్దీప్ యాదవ్ ఫొటోలకు ఫోజిచ్చాడు. జట్టులోకి కొత్తగా వచ్చే ఆటగాళ్లకు ట్రోఫీని అందించే సంప్రదాయాన్ని మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ప్రారంభించాడు. ఈ సంప్రదాయాన్ని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనుసరించగా.. తాజాగా శుభ్‌మన్ గిల్ కూడా వారి బాటలోనే పయనించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‌కు 270 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. దాంతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యం నమోదవ్వడంతో ఆఖరి రోజు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 63/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. 35.2 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసి గెలుపొందింది.
మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 29 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియా మాజీ సారథులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నారు. బుధవారం సాయంత్రం ఫస్ట్ బ్యాచ్ ఆస్ట్రైలియా ఫ్లైట్ ఎక్కనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం కోహ్లీ భారత్‌కు చేరుకున్నాడు.