Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: శుభ్‌మన్ గిల్

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఛేజింగ్‌ ఈజీగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. డ్యూ ప్రభావం ఉండదని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్‌ మాకు ఒక గొప్ప సవాల్. న్యూజిలాండ్ మాపై ఒత్తిడి పెంచింది. ఆటగాళ్లుగా మేం ఆశించింది కూడా ఇదే. మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మేం ముందుగా బౌలింగ్ చేసి, ప్రత్యర్థి ఎంత స్కోర్ చేసినా ఛేజ్ చేయాలనుకుంటున్నాం.

గత మ్యాచ్‌లో బౌలింగ్ వైఫల్యం మా ఓటమిని శాసించింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో కండిషన్స్‌ తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. లెంగ్త్‌లను మారుస్తూ బౌలింగ్ చేయాల్సింది. ఈ విషయంలో మేం మెరుగవ్వాలనుకుంటున్నాం. జట్టులో ఒక మార్పు జరిగింది. ప్రసిధ్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ రీఎంట్రీ ఇచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

Shubman Gill Explains Why India Opted to Field Despite Batting-Friendly Pitch in 3rd ODI vs New Zealand

టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని న్యూజిలాండ్ వన్డే కెప్టెన్ మైఖేల్ బ్రెస్‌వెల్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లా కనిపిస్తోంది. ఇది సిరీస్ డిసైడర్ మ్యాచ్. అంతేకాకుండా భారత గడ్డపై తొలి వన్డే సిరీస్ గెలుచుకోవడానికి ఇది మాకు ఒక అద్భుతమైన అవకాశం. కొత్త ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడుతున్నారు. ఇప్పటి వరకు వారు బాగానే రాణించారు. కానీ ఇప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంది. వారు తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నాం.'అని మైఖేల్ బ్రేస్‌వెల్ పేర్కొన్నాడు.

మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో ఇది సిరీస్ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్‌ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుండగా.. గత మ్యాచ్‌ తరహాలోనే రాణించి తొలి సిరీస్‌ గెలవాలనే పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది.

తుది జట్లు:

న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకారీ ఫోల్క్స్, కైల్ జేమీసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెనాక్స్.

భారత్ : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్. రాహుల్ (కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్.

Story first published: Sunday, January 18, 2026, 13:22 [IST]
Other articles published on Jan 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+